
తుళ్లూరు: అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి స్థానిక రైతు దీక్షా శిబి రం వద్ద రైతులు, మహిళలు కొవ్వొత్తులు వెలిగించారు.అమరావతి రాజధానికి అండగా నిలిచేవారిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని రైతులు, మహిళలు మండిపడ్డారు. చంద్ర బాబును ఇబ్బందులకు గురిచేయడం అందులో భాగమేనన్నారు.జగన్ మోహన్ రెడ్డిది అరాచక,ప్రజాకంటక పాలనని అన్నారు.చంద్ర బాబుకు సంఘీభావం తెలుపుతున్నా మన్నారు.వెంకటపాలెం లోనూ అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఏకైక రాజధాని గా అమరావతిని కొనసాగించాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న దీక్షలు సోమవారంతో 1364 వ రోజుకు చేరాయి.మందడం దీక్షా శిబిరం వద్ద చంద్రబాబుకు సంఘీభావంగా రోడ్డు పై కి వచ్చిన కొంతమంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకొని తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.కొన్ని గంటల తరువాత విడిచిపెట్టారు.