ప్రజాశక్తి-హెల్త్ యూనివర్శిటీ: విజయవాడ నగరానికి కూతవేటు దూరంలో గల కొత్తూరు కొండపైన నానాటికీ శిథిలమవుతున్న ఆరు శతాబ్థాల ఇటుక రాతి ఆలయాన్ని కాపాడుకోవకాలని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషణ్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడిక్డ అన్నారు. మొగల్‌రాజపురంలోని మధు మాలక్ష్మీ కాంప్లెక్స్‌లో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తూరు గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు మేడసాని శుభాకర్, సాహితీవేత్త డాక్టర్ గుమ్మా సాంబశివరావు, వెన్నా వల్లభరావు, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమి అధినే గోళ్ల నారాయణరావుతో కలసి పురాతన కట్టడాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఆలయం పూర్తిగా ఇటుకరాతితో నిర్మించి, సున్నపుగారతో తాపడం చేశారన్నారు. ఆలయ గోడలపై రావిచెట్టు పెరిగి గోడలు, శిఖరం బీటలు పారాయని అన్నారు. కొండవీటి రెడ్డిరాజులు ఆలయాన్ని నిర్మించారని అతి పురాతనమైనదని దీనికి కాపాడుకోవాల్సిన అవశ్యత ఉందని తెలిపారు. ఆలయ పరిసరాలను బాగుచేస్తే పచ్చదనం, ప్రకృతి ఒడితో పాటు చుట్టూ మామిడి తోటలతో విజయవాడ నగర వాసులకు ఒక వారసత్వ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు.










