Nov 07,2023 17:59

గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ఆర్థర్

కొత్తముచ్చుమర్రిలో గడపగడపకు మన ప్రభుత్వం
ప్రజాశక్తి - పగిడ్యాల

మండలంలోని కొత్త ముచ్చుమర్రి గ్రామంలో నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.  గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. గ్రామంలో డ్రైనేజీ కాలువలు నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరారు. గత ప్రభుత్వంలో ఉన్న నిర్మాణం ఇండ్లు మంజూరు అయితే నిన్ను నిర్మించుకున్నామని అయితే ఇంతవరకు వాటి బిల్లు రాలేదని కొందరు గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో ఇళ్లపై ఇవి పవర్ విద్యుత్తు తీగలు ఉన్నాయని వాటివల్ల హాని ఏర్పడే అవకాశం ఉందని విద్యుత్ తీయలను తొలగించాలని గ్రామస్తులు ఎమ్మెల్యేకు విన్నవించారు. గతంలో కంటే చార్జీలు అధికంగా వస్తున్నాయని ఎందుకు అని ఎమ్మెల్యే ను ప్రశ్నించార. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడారు . గ్రామాలలో అభివృద్ధి పని కోసం గడపగడప కార్యక్రమం జరిగిన ప్రతి గ్రామం సచివాలయానికి రూ 20 లక్షలు మంజూర అయితావని ఆయన తెలిపారు. గ్రామ అభివృద్ధి పనుల కోసం తక్షణమే నివేదిక తయారుచేసి పంపించాలన్నారు. అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి పరిశీలించారు కేంద్రంలో పిల్లల కోసం వండిన అన్నాన్ని తిని వచ్చి చూశారు.  కేంద్రంలో పిల్లల విద్య సామర్ధ్యాన్ని పరిశీలించారు. నందికొట్కూరు నియోజవర్గ పరిధిలో 156 గ్రామాలు 86 గ్రామ సచివాలయాలు 156 రోజులలో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించి కొత్త ముచ్చుమరి గ్రామంతో ముగిసింది. రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే చేయలేని కార్యక్రమాన్ని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ గడపగడప కార్యక్రమాన్ని చేసిన మొదటి ఎమ్మెల్యే కావడం ఎంతో అభినందనీయమని అధికారులు ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాధమ్మ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంగిరెడ్డి గారి రమాదేవి, జడ్పిటిసి పుల్యాల దివ్య, ఎంపీపీ మండ్ల మల్లేశ్వరి,  మాజీ జెడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి , వైసిపి నాయకులు కాటం రమేష్ రెడ్డి, కాటం ప్రభాకర్ రెడ్డి, కాటం మురళీధర్ రెడ్డి, వెంకటరమణ , తహశీల్దార్ భారతి, ఎంపిడిఓ వెంకటరమణ, ఎంఈఓ సుభాన్, ఏపీవో మద్దిలేటి, ఏపీఎం శ్రీనివాసులు, ఎస్సై నాగార్జున పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.