
రోడ్డుపై నిలిచిన వాహనాలు
ప్రజాశక్తి- కొత్తకోట:రావికమతం మండలం కొత్తకోటలో ట్రాఫిక్ సమస్య తరచూ తలెత్తుతోంది. తరచూ ట్రాఫిక్ నిలిచి పోవడంతో వాహన దారులు, పాదచారులు నానా అవస్థలు పడుతున్నా రు. ఎదురు ఎదురుగా వచ్చే వాహనాలకు రాకపోకలు సాగించేందుకు వీలు కాక ట్రాఫిక్ వలయంగా మారుతోంది. స్థానిక పోలీసులు ట్రాఫిక్ నివారణకు చర్యలు చేపట్టక పోవడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. గతంలో స్థానిక పోలీసులు ట్రాఫిక్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం తో పాటు సిసి కెమెరాలు అమర్చడం తో ట్రాఫిక్ నియంత్రణ కొంత అదుపులో ఉండేది. ప్రస్తుతం సిసి కెమెరాలు పని చేయక పోవడంతో పాటు పోలీసులు పట్టించుకోలేదని పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా స్థానిక పోలీసులు చొరవ చూపి ట్రాఫిక్ నివారణకు చర్యలు చేపట్టాలని వాహనదారులు, పాదచారులు కోరుతున్నారు.