Jul 31,2023 22:00

అధికారులతో మాట్లాడుతున్న ఐటిడిఎ పిఒ విష్ణుచరణ్‌

ప్రజాశక్తి-పార్వతీపురం :   గిరిజన ఉప ప్రణాళికలో భాగంగా కొత్త ప్రతిపాదనలు సమర్పించాలని పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్‌ అదేశించారు. వివిధ విభాగాల అధికారులతో సోమవారం సాయంత్రం ఐటిడిఎ కార్యాలయంలో పిఒ సమీక్షించారు. ఉప ప్రణాళిక కింద చేపడుతున్న పనుల గూర్చి అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో ఐటిడిఎ ఎపిఒ సురేష్‌, ఇఇ జె.శాంతీశ్వర రావు, మత్స్య శాఖ అధికారి వి.తిరుపతయ్య, పిహెచ్‌ఒ, పిఎఒ తదితరులు పాల్గొన్నారు.