Sep 02,2023 22:09

ప్రజాశక్తి - బుట్టాయగూడెం
    బుట్టాయిగూడెం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో శనివారం నూతనంగా మంజూరైన పింఛన్లను పోలవరం ఎంఎల్‌ఎ బాలరాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ బాలరాజు మాట్లాడుతూ మండలంలో నూతనంగా 397 మందికి నూతన పింఛన్‌ అందిస్తున్నామని, గత ప్రభుత్వం మాదిరిగా జన్మభూమి కమిటీలలో నచ్చిన వాళ్లకు మాత్రమే పింఛన్లు ఇచ్చే వారాని, ఇప్పుడు అర్హులైన వాళ్లందరికీ వాలంటరీ వ్యవస్థ పెట్టి పింఛన్లు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం శాంతి, జడ్‌పిటిసి మొడియం రామ తులసి, ఎంపిడిఒ ఎస్‌.వేణుగోపాల్‌ రెడ్డి, స్థానిక సర్పంచి తెల్లం వెంకాయమ్మ, మండలంలోని సర్పంచిలు, ఎంపిటిసిలు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.