Mar 17,2023 23:34

జాతర సందర్భంగా ఊరేగింపు చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-అనకాపల్లి
ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీనూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జారతలో భాగంగా అమ్మవారి మాల ధారణ సేవా సంఘం అధ్యక్షులు పొలిమేర శ్రీను ఆధ్వర్యంలో 108 ఘటాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో పట్టణంలోని పురవీధుల్లో ఊరేగింపు జరిగింది. రథోత్సవాన్ని ఖోఖో సంఘం జిల్లా అధ్యక్షులు దాడి జైవీర్‌ ప్రారంభించారు. ఊరేగింపులో 20 రకాల నేలవేషాలు, శూలధారణ, అమ్మవారి వేషధారణ, పులి వేషాలు, తెలంగాణ పోతురాజు విన్యాసాలు, కేరళ వాయిద్యాలు, ఒరిస్సా కళాకారుల బలంగీర్‌ భాజ వంటి పలు వేషాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి బుద్ధ లక్ష్మీ నగేష్‌, కార్పొరేటర్లు కొణతాల నీలిమ భాస్కరరావు, పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు, కనకదుర్గ ఆలయ వ్యవస్థాపకులు పివి రమణ తదితరులు పాల్గొన్నారు.