ప్రజాశక్తి - కామవరపుకోట
పెళ్లయిన అనంతరం తొలిసారి ఇంటికి వచ్చిన తన అల్లుడికి 108 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు కామవరపుకోట సొసైటీ ఛైర్‌పర్సన్ సాయిన కనకరాజు, ఉమాదేవి దంపతులు. వారి కుమార్తె గౌతమికి హైదరాబాద్ పట్టణానికి చెందిన సందేష్‌కు ఈ నెల తొమ్మిదిన వివాహమైంది. ఆదివారం ఇంటికి వచ్చిన నూతన దంపతులు సందేష్, గౌతమీలకు 29 రకాల స్వీట్లు, ఐదు రకాల బజ్జీలు, 15 రకాల జ్యూస్‌లు, పలు రకాల పులిహోరలు, బిర్యానీలు, వివిధ రకాల పిండి వంటలు, శాఖాహార కూరలు, రసం, సాంబారు, ఉలవచారు, పచ్చిపులుసు, మజ్జిగ పులుసు, బూరెలు, గారెలు, అరిసెలు, బొబ్బట్లు ఏర్పాటు చేసినట్లు సాయిన కనకరాజు తెలిపారు.










