Jan 17,2023 23:09

విచారణ చేపడుతున్న డిఎస్‌పి

ప్రజాశక్తి-మాకవరపాలెం:జి.వెంకటాపురం శివారు నగరం గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన కొట్లాట కేసుపై డిఎస్పి ప్రవీణ్‌ కుమార్‌ మంగళవారం విచారణ చేపట్టారు. ఇరు వర్గాల వారిని విడి విడిగా విచారణ చేశారు. రెండు వర్గాల మధ్య గొడవ ఎందుకు వచ్చింది అనే దానిపై విచారించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇరు వర్గాలకు చెందిన 20మందిపై కేసు నమోదు చేశామన్నారు. త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. గ్రామస్తులు ప్రశాంత వాతావరణంలో ఉండాలన్నారు. సమస్యలు ఉంటే చర్చించుకోవాలి తప్ప ఇలా తగాదాలకు దిగకూడదని సూచించారు. గ్రామంలో నిఘా పెట్టాలని ఎస్సై రామకృష్ణారావుకి సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రమణయ్య, దళిత సంఘం నాయకులు అప్పలరాజు, చలపతి రావు పాల్గొన్నారు.