పాచిపెంట: మండలంలోని కొటికిపెంట, గరేళ్లవలస, కోడికాళ్లవలసలో గ్రామాల్లో సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆదివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సిఎం రాజన్న దొర ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో లబ్ధిదారులకు అందించిన సంక్షేమ పథకాలు వివరించారు. సమస్యలుంటే తెలియజేయాలని, సత్వర పరిష్కారం చేసేలా చర్యలు చేపడతామని తెలిపారు. ముఖ్యంగా కోటికి పెంట పెద్దగెడ్డ జలాశయం ముంపు గ్రామం వల్ల ప్రధాన సమస్య ఇళ్ల స్థలాలు కావడంతో తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని గ్రామస్తులు రాజన్నదొర దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన త్వరలో ఇళ్ల స్థలాలు కేటాయించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపిపి బి.ప్రమీల, ఎంపిడిఒ జి.పార్వతి, ఎఒ కె.తిరుపతిరావు, ఎంపిటిసి సభ్యులు డి.ఏడుకొండలు, వైసిపి నాయకులు డోల బాబ్జీ, పి.వీరమనాయుడు, టి.గౌరీశ్వరరావు, సలాది అప్పలనాయుడు, పలువురు సర్పంచులు, పలు శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.










