Mar 29,2023 00:18

కొసనా చిత్రపటం వద్ద నివాళి...

ప్రజాశక్తి-సీతమ్మధార : ఆరున్నర దశాబ్దాల సాంస్కృతిక రంగ రథ సారధిగా సేవలందించిన కొసనా చిరస్మ రణీయులని పలువురు కొనియాడారు. ఘంటసాల స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కొసనా తృతీయ వర్థంతిని మంగళవారం పౌర గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ డిప్యూటీ మేయర్‌ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ, కళలను, కళాకారులను ప్రోత్సహించిన సాంస్కృతిక నిఘంటువు కొసనా అని కీర్తించారు. కళా వేదిక ట్రస్ట్‌ అధ్యక్షులు డాక్టర్‌ నండూరి రామకృష్ణ మాట్లాడుతూ సంగీతం, సాహిత్యం, నాటకం, చిత్ర లేఖనం, నిర్వాహక తదితర అంశాల్లో నిరంతరం సేవలు అందించిన వ్యక్తి కొసనా అని కొనియాడారు. కొసనా తనయుడు బ్రహ్మాజీరావు మాట్లాడుతూ, తన తండ్రి స్మారకార్ధం ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి చెన్నా తిరుమలరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆధ్యాత్మిక వేత్తలు ఎస్‌.ఫణిస్వామి, ఎంవి.రాజశేఖర్‌, కొసనా కల్చరల్‌ అకాడమి అధ్యక్షులు సుసర్ల శేషమణి, స్వర రంజని అధ్యక్షులు లతా రాములు, కళా రంగ ప్రముఖులు మేడా మస్తాన్‌రెడ్డి, నాంచారయ్య, పి.శ్యామ్‌సుందర్‌, మెలోడీ సత్యనారాయణ, ఎంవిఆర్‌ నాగేశ్వరరావు, ఎంటిఆర్‌ త్రినాధ్‌, లెఫ్టనెంట్‌ లోకేష్‌, బంగార్రాజు, బి.సత్యమాధురి తదితరులు కొసనా చిత్ర పటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు.