ఈసీ ఇవ్వాలంటే ఈజీ కాదు..
జిల్లాలో వినియోగదారులు ఇక్కట్లు
కొరవడిన పర్యవేక్షణ
డిజిటల్ విధానం అందుబాటులో ఉన్నా తప్పని తిప్పలు
ప్రజాశక్తి- తిరుపతిటౌన్: స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఆస్తుల కొనుగోలు, వాటి వివరాలు తెలుసుకోవడానికి ఈసీ అంత్యంత కీలకం. ఈసీ ద్వారా వివరాలు తెలుసుకున్న తర్వాతే ఎవరైనా ఆస్తులు కొనడం, అమ్మడం, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందేందుకు వీలు ఉంటుంది. అటువంటి కీలకమైన ఈసీ పొందేందుకు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఓ ప్రత్యేక వ్యవస్థనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసీ ద్వారా ప్రజల ఆస్తుల వివరాలు మరింత లోతుగా తెలుసుకునేందుకు ఏకంగా డిజిటల్ వ్యవస్థను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ వ్యవస్థ ద్వారా ఈసీ ఆడిగిన 10 నిముషాల్లో సేవాలుపొందేలా ఈస్టాంపింగ్ విధానం అమల్లోకి తెచ్చింది. కానీ అటువంటి వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులో తెచ్చిన తిరుపతి జిల్లాలో ఉన్న పలు సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈసీ ఇవ్వాలంటే చుక్కలు కనబడుతున్నాయి.
తిరుపతి జిల్లా సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈసీ ఇవ్వాలంటే చుక్కలు కనబడుతున్నాయని వినియోదారులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది ఈసీ ఇవ్వడానికి ఇబ్బందులు గురి చేస్తున్నారని, ఈసీ తీసుకోవాలంటే కనీస నాలుగు, ఐదు రోజులు సమయం పడుతుందని ప్రజలు చెబుతున్నారు. ఈసీ ఎందుకు ఆలస్యం అవుతుందని అధికారులను ప్రశ్నిస్తే సర్వర్ సమస్య పేరు చెప్పి తప్పించుకుంటురని విమర్శలు ఉన్నాయి. తిరుపతి జిల్లా రిజిస్ట్రేషన్ పరిధిలో రేణిగుంట, శ్రీకాళహస్తి లాంటి కార్యాలయంలో ఈసీ కోసం దరఖాస్తు ఉదయం చేసుకుంటే సాయంత్రానికి ఇస్తున్నారని, తిరుపతి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎందుకు సమయం పడుతుందని ప్రశ్నిస్తున్నారు. తిరుపతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈసీ కోసం ఇబ్బందులు పడుతున్న సంబందింత క్లర్కు ఏమి చేస్తున్నారని వినియోగదారులు అంటున్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు ఎందుకు సూపర్‌వైజర్ చేయడం లేదని ప్రశ్నలు ఉత్పనమవతున్నాయి. కానీ సంబంధిత క్లర్కుని ఎప్పుడు అడిగిన సర్వర్లు పనిచేయడం లేదని సమాధానం దాటవేస్తున్నారు. వాస్తవానికి మార్కెట్ వాల్వు సర్టిఫిట్ ఇచ్చేందుకు పది నిముషాలు పడుతుంది. ఐదు రోజులు తరువాత రమ్మని చెప్పడం తమకు ఇబ్బందిగా ఉంటుందని వినియోగదారులు వాపోతున్నారు. ఈసీ కోసం ఉదయం దరఖాస్తు చేస్తే గంటలోపు గతంలో ఇచ్చేవారని, ఇపుడు సర్వర్ సమస్య చెప్పి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల వినియోగదారులు అవస్థలు వర్ణతీతంగా మారింది. ఈ విషయమై జిల్లా రిజిస్ట్రేషన్ అధికార్లు దృష్టికి తీసుకుపోయిన సమస్య మాత్రం ఆలానే ఉందని వినియోగదారులు వాపోతున్నారు. ఇప్పటికైయిన ఉన్నతాధికారులు జ్యోకం చేసుకోని ఈసీ తర్వగా ఇచ్చేవిధంగా చూడాలని దానివల్ల తమకు ఇబ్బందులు తగ్గుతాయని వారు అంటున్నారు.










