Sep 03,2023 20:13

కోటంరెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిన నేతలు

ప్రజాశక్తి -నెల్లూరు ప్రతినిధి :నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్‌, నక్కలగుంట, ఏరుకులపాలెంలో బాబు షఉ్యరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిర్వహించారు. ఏ కార్యక్రమం చేపట్టాలన్నా మహిళల ఆశీర్వాదం తీసుకోవడం అలవాటన్నారు. టిడిపి జెండా పట్టుకొని, సైకిల్‌ గుర్తుపై ఓటు వేయమని మీ ముందుకు వచ్చానని, అందరి ఆశీస్సులు ముఖ్యమంత్రిగా నారా చంద్ర బాబు నాయుడికి ఉండాలన్నారు. 20వ డివిజన్‌ కార్పొరేటర్‌ చేజర్ల మహేష్‌, చేజర్ల కవిత, దారా మల్లి, పోతురాజు రవి, అల్లం లక్ష్మి, కన్నయ్య, గంటా డేవిడ్‌, మాసా శ్రీనివాసులు, డేవిడ్‌ రాజా, నవీన్‌, బాల, హెచ్‌.ఎస్‌. రెడ్డి, వెంకటేష్‌, సిద్దు తదితరులు పాల్గొన్నారు. 21వ డివిజన్‌, బి.వి. నగర్‌ సెంటర్లో బాబు షఉ్యరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కష్టకాలంలో నాకు అండగా ఇంతపెద్ద ఎత్తున విచ్చేసిన నా అక్క, చెల్లి, అన్న, తమ్ముడు వయసు ఉండే ప్రతి ఒక్కరికి చేతులు జోడించి మరియు నా తల్లి, నా తండ్రి వయసు ఉండే వారికి పాదాభివందనం చేస్తునన్నారు. 35వ డివిజన్‌ కు చెందిన తూమాటి ముని రెడ్డి, చీపినాపి రవి, దండూరి మణిరత్నం, షేక్‌ అన్వర్‌ ఆధ్వర్యంలో వారి మిత్రబందంతో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు ఉన్నారు.