Aug 22,2023 21:15

కోతలు..వాతలు..!

రాయచోటి : అప్రకటిత విద్యుత్‌ కోతలతో అన్నమయ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగలంతా కష్టపడి పనిచేసిన తిరిగి రాత్రి ఇంటికి చేరుకొని ప్రశాంతంగా నిద్ర పోవాలనుకునే వారికి విద్యుత్‌ కోతలతో అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు పట్టణాల్లో గాలి వీచకపోవడంతో నిద్ర లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండా ల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ పక్క ప్రభుత్వం కోతలు లేని విద్యుత్‌ అందిస్తా మంటూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ రాయచోటి జిల్లా ప్రాంతంలో మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు ల విద్యుత్‌ కోతలు విధించడం వల్ల చిన్న చిన్న వ్యాపా రులు కూడా ఇబ్బందులు గురవుతున్నారు. జిరాక్స్‌ సెంటర్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్న నిరుద్యోగులు కరెంట్‌ ఉంటేనే రూ.10 సంపాదించుకోగలుతున్నారు. కరెంటు లేకపోవడం వల్ల జిరాక్స్‌కి వచ్చిన వాళ్ళు వెనుతిరగడంతో వచ్చే పది రూపాయలు కూడా రావడం లేదని పేర్కొన్నారు. మరోవైపు సామాన్యులు సైతం కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వమేమో విద్యుత్‌ ఛార్జీలు పెంచమని ఎన్నికల ముందు వాగ్దానం చేసి నేడు అధికారంలోకి ఇప్పటి వరకు 8సార్లు కరెంటు ఛార్జీలు పెంచడంతో సామాన్యులు బిల్లులు పెట్టలేక ఇబ్బంది అవుతున్నారు. విద్యుత్‌ చార్జీలు పేరుతో మోత మోగిస్తూ సామాన్యుడు కూడా విలవిలలాడే పరిస్థితి నెలకొంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అధిక బిల్లులు వస్తున్నాయి. వాడుకున్న విద్యుత్‌ బిల్లు కంటే అదనపు ఛార్జీలే ఎక్కువగా ఉంటున్నాయని వాపోయారు.
ఇటీవల కాలంలో రాయచోటి, మదనపల్లి, పీలేరు, రాజంపేట, రైల్వే కోడూరు, తంబళ్లపల్లె ప్రాంతాల్లోనే ఏకంగా నాలుగైదు గంటలపాటు విద్యుత్‌ కోతలు విధించడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత ఆదివారం రాయచోటి పట్టణంలో ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. అటు వ్యాపారులు, ప్రజలు, అధికారులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ప్రభు త్వం విద్యుత్‌ కోతలు మాత్రం యథావిధిగా కొనసాగిస్తూనే ఉన్నారు. అధిక బిల్లులు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఇంటికి రెండు బలుపులు, ఒక ఫ్యాను ఉన్న అలాంటి ఇంటికి కూడా వేలాది రూపాయలు కరెంటు బిల్లు రావడంతో ఆ ఇంటి యజమాని లబోదిబోమంటూ కార్యాలయం చుట్టూ తిరిగుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్‌ అధికారులు స్పందించి విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.
అంతరాయాన్ని నివారించాలి
పట్టణంలో ఇటీవల కాలంలో విద్యుత్‌ కోతలు ఎక్కువగా ఉన్నాయి. విద్యుత్‌ ఛార్జీలు మాత్రం అధికంగా వసూలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో గత ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు పట్టణంలో విద్యుత్‌ కోత ఉంది దీనివల్ల చిన్న పిల్లలు విద్యార్థులు వద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సమాన అధికారులు స్పందించి విద్యుత్‌ అంతరాయాన్ని నివారలించాలి.
- అబ్బవరం శ్రీనివాసులు, వినియోగదారుడు, రాయచోటి
విద్యుత్‌ అంతరాయం లేకుండా చూస్తున్నాం
జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సోమవారం సింహాచలం వద్ద 500 మెగావాట్ల పవర్‌ ప్లాంట్‌ సాంకేతిక సమస్య కారణంగా షట్‌ డౌన్‌ అయింది. దీంతో చిన్నపాటి అంతరాయం ఏర్పడింది. హైడల్‌ ప్లాంట్‌లకు ఇన్‌ఫ్లోలు తక్కువగా ఉండటంతో హైడల్‌ ప్లాంట్‌లలో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి లేదు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా దేశీయ భారం తగ్గలేదు. విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
-వై.చంద్రశేఖర్‌రెడ్డి, విద్యుత్‌ ఇఇ ,రాయచోటి.