కోటలో సీఫుడ్స్ రెస్టారెంట్ ప్రారంభం
కోటలో సీఫుడ్స్ రెస్టారెంట్ ప్రారంభం
ప్రజాశక్తి -కోట
కోట మండలంలో నూతనంగా సీ పుడ్స్ రెస్టారెంట్‌ను వైసీపీ స్టేట్ సెక్రటరీ పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి చేతులుమీదుగా ప్రారంభించారు. సోమవారం కోట మండలంలో ఆక్సిస్ బ్యాంక్ సమీపంలో నూతనంగా సీ పుడ్స్ రెస్టారెంట్ ను పి.సురేష్ ఆధ్వర్యంలో అన్ని రకాల సీ పుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాటు చేశారు. రెస్టారెంట్ ను కోట తా హాసిల్దార్ పద్మావతి, ఎంపీడీవో భవాని, ఎంపీపీ దాసరిఅంజమ్మ లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిద్దవరం సొసైటీ బ్యాంక్ చైర్మన్ రాధా కష్ణా రెడ్డి, కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ సభ్యులు దువ్వూరు. సాయి కష్ణా రెడ్డి, వైసీపీ నాయకులు ఇన్నమాల. వెంకటాద్రి, ఆక్సిస్ బ్యాంక్ మేనేజర్ వెంకయ్య పాల్గొన్నారు.










