ప్రజాశక్తి-నర్సీపట్నం రూరల్:పరవాడ పార్మా సిటీ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని .బిఎస్పీ అనకాపల్లి జిల్లా ఇన్చార్జ్ బొట్టా నాగరాజు కోరారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఫార్మా సిటీలో పని చేస్తున్న ఉద్యోగులకు సరైన భద్రత కల్పించడంలో యాజమాన్యం విఫలమైందని ఆరోపించారు. కార్మికులపై యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నాయన్నారు. ఫార్మాసిటీపై ఒక కమిటీ వేసి సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గంగాధర్, లోకేష్, శ్రీరామ్ పాల్గొన్నారు.
నర్సీపట్నంటౌన్‌్:ఫార్మా మృతుల కుటుం బాలకు రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ కోరారు. స్థానిక మండలం బ్యాంక్ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాసంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ,మరణించిన వ్యక్తుల కుటుంబాలకు తక్షణమే 50 లక్షలు, తీవ్రంగా ప్రమాదానికి గురైన వ్యక్తులకు 25 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రామునాయుడు పాల్గొన్నారు.










