Feb 10,2023 23:13

మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రావణ్‌ కుమార్‌

ప్రజాశక్తి-పెదబయలు:కాకినాడ జిల్లా రాగంపేటలో ఆయిల్‌ ఫ్యాక్టరీ ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి కిడారి శ్రావణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. పెదబయలు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు కూలి పనులకు వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల సీనియర్‌ నాయకులు తైసభు త్రినాథ్‌, అరకు పార్లమెంట్‌ రైతు సంఘం అధ్యక్షుడు కూడ భూషణరావు, రాష్ట్ర ఎస్టీ సెల్‌ ఆర్గనైజర్‌ సెక్రటరీ సాగర సుబ్బారావు, అరకు అసెంబ్లీ ఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు సల్లంగి రవి కుమార్‌, మాజీ ఎంపీటీసీ కటారి బాలం నాయుడు, దారెల సర్పంచ్‌ పాంగి పాండురంగస్వామి, వార్డు మెంబర్‌ కిముడు తిరుపతిరావు, టీడిపి నాయకులు వెంకటరమణ, రాజారావు, యువ నాయకులు మండి కిషోర్‌ కుమార్‌, నాగేంద్ర, త్రినాథ్‌, తదితరులు పాల్గొన్నారు.