
ప్రజాశక్తి -అరకులోయ:అరకు నియోజక వర్గంలో రూ.1 కోటి 30 లక్షల వ్యయంతో నిర్మించిన 13 అంగన్వాడీ భవనాలను అరకు శాసన సభ్యులు చెట్టి పాల్గుణ, ఐటిడిఏ పీఓ వి.అభిషేక్ సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద శిలాఫలకాలను ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా అరకు శాసన సభ్యులు చెట్టి పాల్గుణ మాట్లాడుతూ, కోటి 30 లక్షలతో అంగన్వాడీ భవనాల నిర్మాణం చేపట్టామన్నారు. అనంతగిరి మండలంలో 3, అరకులోయ మండలంలో 2, హుకుంపేటలో 3, ముంచంగిపుట్టులో 1, పెదబయలులో 4 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. అంగన్వాడీ కేంద్రాలు చిన్న పిల్లలకు, బాలింతలకు, గర్భవతులకు ఉపయోగ కరంగా ఉంటుందన్నారు. లబ్దిదారులకు పోషకాహారం పంపిణీకి ఉపయోగ పడతాయని, లబ్దిదారులు అంగన్వాడీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఐటిడిఏ పిఓ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలకు సౌకర్యాలు మెరుగు పరుస్తు న్నామన్నారు. ఎస్‌సిఏ నిధులతో 35 అంగన్వాడీ భవనాలు నిర్మిస్తున్నామన్నారు. పాడేరు నియోజక వర్గంలో గత నెలలో 12 భవనాలను ప్రారంభించామన్నారు. అరకుకు నియోజక వర్గంలో 13 ప్రారంభించినట్లు చెప్పారు. మిగిలిన 10 భవనాలను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఇఇ కె. వేణుగోపాల్, తహశీల్దార్ ఏ.వేణుగోపాల్, అరకులోయ సిడిపిఓ కె.శారద, ఎంపిపి ఉషారాణి, వైస్ ఎంపిపిలు ఎల్.భీమరాజు, కె.రామన్న, ఎపిటిసి ఆనంద్ కుమర్, గిరిజన సంక్షేమ శాఖ ఎఇ అభిషేక్, తదితరులు పాల్గొన్నారు.