
ప్రజాశక్తి - పాలకోడేరు
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా కోరుకొల్లు రావడం తనకెంతో ఆనందంగా ఉందని భీమవరం ఆర్‌డిఒ కె.శ్రీనివాసులు రాజు అన్నారు. కోరుకొల్లులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్, తణుకు నియోజకవర్గ పరిశీలకులు మంతెన యోగేంద్ర కుమార్ (బాబు) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ సంగీత్ మాధుర్‌తో కలిసి ఆర్‌డిఒ శ్రీనివాసులు రాజు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కోరుకొల్లు, మైప గ్రామాల సర్పంచులు మంతెన భారతి, గొట్టుముక్కల జయంతి అధ్యక్షత వహించారు. అనంతరం ఆర్‌డిఒ శ్రీనివాసులు రాజు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని యోగేంద్ర కుమార్‌ను అభినందించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ సంగీత్ మాధుర్ మాట్లాడుతూ ఆరోగ్య సురక్ష ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఏదో ఉంది కాబట్టి వైద్యులకు చూపించుకోవడం కాదని, ఎటువంటి అనారోగ్యాలు రాకుండా క్యాంపుల్లో చూపించుకోవాలన్నారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ బాబు మాట్లాడుతూ పాదయాత్రలో జగన్ ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని చక్కటి పరిపాలన అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మైప ఎంపిటిసి తంగేళ్ల మంజుల, ఉపసర్పంచి చేకూరి ఆంజనేయరాజు, నాయకులు గొట్టుముక్కల తిరుపతిరాజు, కలిదిండి శ్రీనివాస్ వర్మ, పాల రాధాకృష్ణ, మంతెన చిన్న చంటి, కొండేటి శివకుమార్, మాజీ ఎంపిటిసి సోమేశ్వరరావు, వైద్యులు జివి.సూర్యనారాయణ రాజు, శామ్యూల్, హరిత సాయి, సుకుమారి పాల్గొన్నారు.
8 ఎకరాల్లో జగనన్న లేఅవుట్ ఏర్పాటు
కోరుకొల్లులో ఎనిమిది ఎకరాల్లో జగనన్న లేఅవుట్‌లో ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మంతెన యోగేంద్ర కుమార్ (బాబు) తెలిపారు. గ్రామంలో జగనన్న లేఅవుట్‌లో జరుగుతున్న గృహ నిర్మాణాలను ఆర్‌డిఒ శ్రీనివాసులు రాజు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ సంగీత్ మాధుర్ పరిశీలించారు. బాబు జగనన్న లేఅవుట్‌కు సంబంధించి పలు విషయాలను వారికి వివరించారు. అడిగిన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందించడంతో పాటు ఇంటి రుణాలు కూడా మంజూరు చేసినట్లు తెలిపారు. ఆర్‌డిఒ శ్రీనివాసులు రాజు మాట్లాడుతూ లేఅవుట్ ఏర్పాటు బాగుందన్నారు. ఆయన వెంట తహశీల్దార్ షేక్ హుస్సేన్, రీసర్వే డిప్యూటీ తహశీల్దార్ సూర్యనారాయణ రాజు, ఆర్‌ఐ నాగభూషణం నాయుడు, ఇఒపిఆర్‌డి కె.నాగేంద్రకుమార్, హౌసింగ్ ఎఇ నరసింహారావు, పంచాయతీ కార్యదర్శి శ్యామ్ ఉన్నారు.
ఆర్‌డిఒ, ట్ర్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌కు సత్కారం
కోరుకొల్లు గ్రామానికి మొట్టమొదటిసారిగా వచ్చిన భీమవరం ఆర్‌డిఒ కె.శ్రీనివాసులు రాజు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ సంగీత్ మాధుర్‌ను రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మంతెన యోగేంద్ర కుమార్‌బాబు, సర్పంచి మంతెన భారతి, గ్రామ వైసిపి నాయకులు, గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. అలాగే నెల రోజుల నుంచి ఆరోగ్య సురక్ష క్యాంపులో నిరుపేదలకు వైద్య సేవలందిస్తున్న వైద్యులు చెన్న శామ్యూల్, సాయి చంద్ర, సత్యానంద్, హరిత సాయి, సుకుమారి, రాజుబాబును బాబు ఆధ్వర్యంలో ఆర్‌డిఒ శ్రీనివాసులు రాజు సత్కరించారు. అనంతరం సర్దార్ వల్లభారు పటేల్ జయంతిని పురస్కరించుకుని వేదిక పైనుంచి ప్రతిజ్ఞ చేశారు.