Jul 05,2023 00:23

తహశీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న న్యాయవాదులు

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : సత్తెనపల్లిలో అన్ని కోర్టులు కలిపి ఒకేచోట నూతన కోర్టు కాంప్లెక్స్‌ నిర్మించాలని సత్తెనపల్లి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మారూరి లింగారెడ్డి డిమాండ్‌ చేశారు. ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ ఎపి రాష్ట్ర సమితి పిలుపు మేరకు స్థానిక తాలూకా కోర్టు న్యాయ దేవత విగ్రహం వద్ద మంగళవాకరం డిమాండ్స్‌ డే పాటించారు. న్యాయవాదుల రక్షణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టాలని, న్యాయవాదుల డెత్‌ బెనిఫిట్స్‌ రూ.8 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచాలని, పెండింగ్‌లో ఉన్న డెత్‌ బెనిఫిట్స్‌ రూ.30 కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆరోగ్య బీమా మొత్తాన్ని పెంచాలన్నారు. ఈ మేరకు తహశీల్ధార్‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఐఎఎల్‌ ఎపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎన్‌.వేణుగోపాల్‌, జిల్లా ఉపాధ్యక్షులు కె.వీరభాస్కర్‌రెడ్డి, సీనియర్‌ న్యాయవాదులు సిహెచ్‌.విజయభాస్కర్‌రెడ్డి, కె.హనుమయ్య, పి.వెంకటకోటయ్య, కె.వెంకటేశ్వరరావు, జె.విజరుకుమార్‌, బి.సంగీతరావు, డి.శ్రీనివాస్‌, బి.శ్రీనివాసబాబు, యు.పాపారావు, ఎస్‌.వీరయ్య, సిహెచ్‌.బాలకోటయ్య, పి.రవికుమార్‌, జి.వెంకటశివ, సిహెచ్‌.బాబూరావు, విద్యాసాగర్‌రెడ్డి, షేక్‌ నాగూర్‌బాబు, సిహెచ్‌.భరద్వాజరెడ్డి, ఎ.నాగార్జున పాల్గొన్నారు.