రోగిని ఆరోగ్య వివరాలు అడుగతున్న వైద్యాధికారి
ప్రజాశక్తి-డుంబ్రిగూడ:మండలంలోని కిలోగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి కోర్రాయి సబ్ సెంటర్ లో బుధవారం మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి హాజరైన వైద్యాధికారిని కె.కరుణ వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, వ్యాధులు ప్రబలితే నిర్లక్ష్యం వహించకుండా వైద్య సిబ్బందిని ఆశ్రయించి చికిత్స చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య వంతులుగా ఉండాలని ఆమె సూచించారు. భోజన సమయాల్లో కాచి చల్లార్చిన నీటిని వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది జానికమ్మ, ఆశ వర్కర్లు, హెల్త్‌అసిస్టెంట్లు పాల్గొన్నారు.










