ప్రజాశక్తి - కాకినాడరూరల్
కోరమండల్ ఇంటర్నేషనల్ సేవలు అభినందనీయమని కాకినాడ రూరల్ ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు అన్నారు. వాకలపూడి జడ్‌పి ఉన్నత పాఠశాలలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కాకినాడ రూ.25 లక్షల సి.ఎస్.అర్ నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభిం చారు. అనంతరం వాకలపూడి జ్యోతి బా ఫూలే కాలనీలో రూ.11లక్షల సిఎస్ ఆర్ నిధులతో కోరమండల్ ఆధ్వర్యంలో నిరి సురక్షిత ఆర్‌ఒ ప్లాంట్ను ఎంఎల్‌ఎ కన్నబాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ మన బడి, నాడు-నేడు పథకంలో నాలుగేళ్ల వ్యవధిలో దశల వారీగా పాఠశాలల్లో మౌలిక సదుపా యాలను ఏర్పాటు చేస్తు న్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరించి కార్పొరేట్‌కు దీటుగా అధునాతన వసతులతో ప్రభుత్వ బడులను తీర్చి దిద్దుతు న్నామన్నారు. ప్రజలకు సురక్షిత మంచినీరు అందించేందుకు కాకినాడ కోరమండల్ ఇంటర్ నేషనల్ ఆధ్వ ర్యంలో ఆర్‌ఒ వాటర్ ప్లాంట్ నిర్మించడం అభినందనీయమన్నారు. అవకా శాన్ని గ్రామ ప్రజలు వినియోగిం చుకోవాలని కోరారు. కార్యక్రమంలో కోరమండల్ ప్రతి నిధులు, వైసిపి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ కన్నబాబు, కోరమండల్ ప్రతినిధులు










