Dec 16,2022 23:55

సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తున్న డిఇఒ చంద్రకళ, తహశీల్దార్‌ వీరభద్రరావు


ప్రజాశక్తి ములగాడ : కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ ఆధ్వర్యాన సంస్థ గ్రౌండ్‌ ఆవరణలో సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను శుక్రవారం డిఇఒ చంద్రకళ, తహశీల్దార్‌ వీరభద్రరావు ప్రారంభించారు. కెమిస్ట్రీ, ఇట్స్‌ ఫండమెంటల్‌ ఇనిషియేటివ్‌కి సంబంధించి 27 వివిధ పాఠశాలల నుంచి 2300 మంది విద్యార్థులు 701 సైన్స్‌ నమూనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డిఇఒ, తహశీల్దార్‌ మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తాయని చెప్పారు. సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ జ్ఞాన సుందరం మాట్లాడుతూ, కెమిస్ట్రీ ఉపయోగం, పిల్లలకు ఉపయోగపడే దాని మూలాధారాలను వివరించారు. అనంతరం డిఇఒ చంద్రకళ, తహశీల్దార్‌ వీరభద్రరావును సంస్థ అధికారులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎవిపి హెచ్‌ఆర్‌ రంగకుమార్‌, జిఎస్‌వి రాజా, డిజిఎం హెచ్‌ఆర్‌ శ్రీనివాసరావు, ఎవిపి రంగనాయకులు, శ్రీకాంత్‌, సిఎస్‌ఒ నారాయణ పాత్రుడు, యువిఎస్‌ఎన్‌ శర్మ పాల్గొన్నారు.