Mar 09,2023 23:39

కార్మిక సంఘాల నేతలతో ప్రచారం చేపడుతున్న రమాప్రభ

ప్రజాశక్తి-యంత్రాంగం
ఉత్తరాంధ్ర పట్టభద్రుల పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని విశాఖ ఉక్కు పట్టభద్రులకు కార్మిక సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలో పలు సంఘాల నేతలు ముమ్మరంగా ప్రచారం చేపట్టారు.
ఉక్కునగరం : ఉత్తరాంధ్ర పట్టభద్రుల పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని విశాఖ ఉక్కు పట్టభద్రులకు కార్మిక సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రధాన పరిపాలన విభాగం వద్ద గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టీల్‌ప్లాంట్‌ గుర్తింపు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రజాతంత్రవాదులను మండలికి పంపిస్తే పేద, మధ్యతరగతి గొంతును, కార్మిక వాణిని వినిపిస్తారని చెప్పారు. స్టీల్‌ సిఐటియు గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటంలో భాగస్వామ్యమైన రమాప్రభ గెలుపు ఉద్యమం బలోపేతానికి దోహదపడుతుందన్నారు. జివిఎంసి 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు మాట్లాడుతూ, నిరంతరమూ ప్రజా సేవ చేస్తున్న రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉక్కు కార్మికులను అభ్యర్థించారు. యూనియన్‌ ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ, రమాప్రభ గెలుపంటే విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ఇవ్వడమేనని పేర్కొన్నారు. ఎఐసిటియు ప్రధాన కార్యదర్శి చిత్రాల సన్యాసిరావు మాట్లాడుతూ, విశాఖ ఉక్కులో ఉన్న పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి ఉద్యమాలకు మద్దతు పలుకుతున్న రమాప్రభను గెలిపించి శాసనమండలికి పంపించాలని కోరారు. డివిఆర్‌ఎస్‌ఇయు ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, డిఐటియు నాయకులు సురేష్‌ కుమార్‌, సిపిఐ నాయకులు టి.కనకరాజు, ఎఐటియుసి నాయకులు రామకృష్ణ, రాజబాబు, సిఐటియు నాయకులు వైటి.దాస్‌, ఎం.రామారావు, డిసిహెచ్‌.వెంకటేశ్వరరావు, బి.అప్పారావు, నీలకంఠరావు, కెఎం శ్రీనివాసరావు, యూజ్‌ నాయకులు కామేశ్వరరావు పాల్గొన్నారు.
గాజువాక : గాజువాక కోర్టు కాంప్లెక్స్‌లో లాయర్లను, ఉద్యోగులను, సిబ్బందిని కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆమె మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు.72వ వార్డు కార్పొరేటర్‌ స్టాలిన్‌ మాట్లాడుతూ, సమస్యలపై పోరాటానికి రమాప్రభను ఎన్నుకోవాలని లాయర్లకు విజ్ఞప్తి చేశారు. లాయర్లు ఎ.సీతామహాలక్ష్మి, బి.రామారావు, వెన్నెల ఈశ్వరరావు, శ్రీనివాసరావు, నిరంజన్‌, బి.సంతోష్‌కుమారి, సిపిఎం కార్యదర్శి ఎం.రాంబాబు, నాయకులు నగిరెడ్డి రామారావు, ఎన్‌.రాజేంద్రప్రసాద్‌, జి.స్టాలిన్‌, సిపిఐ జోన్‌ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.
కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరుతూ జివిఎంసి 67వ వార్డు పరిధిలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు కె.సంతోషం, వార్వా, నివాస్‌ నాయకులు డాక్టర్‌ ఎం.రమేష్‌కుమార్‌, కిరీటం పాల్గొన్నారు.
కరాస: డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని 90వ వార్డు పరిధి కాకానినగర్‌లో ఐద్వా నాయకులు ప్రభావతి ఆధ్వర్యాన ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్‌, వై.సత్యనారాయణ, నీలిమ, ఎంవి.నారాయణ పాల్గొన్నారు.
పెందుర్తి : 97వ వార్డు పరిధి కార్మికనగర్‌లో రమాప్రభకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకులు రమణి మాట్లాడుతూ, శాసనమండలిలో ప్రజలు తరపున పోరాడేది పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలేనని చెప్పారు. సిఐటియు నాయకులు జగన్‌, ఐద్వా నాయకులు రమణి, కాలనీ నాయకులు పాల్గొన్నారు.
లీగల్‌ విలేకరి : కోరెడ్ల రమాప్రభకు మద్దతుగా ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభ హాజరై మాట్లాడారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బివి.రామాజనేయరావు, ఐఎయల్‌ రాష్ట్ర అధ్యక్షులు కెఎస్‌ఎస్‌.సురేష్‌కుమార్‌ పాల్గొన్నారు.
గోపాలపట్నం : కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని తూర్పుగోదావరి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎం.వెంకటేశ్వరరావు పట్టభద్రులను కోరారు. గోపాలపట్నం సిఐటియు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. సిఐటియు జోన్‌ అధ్యక్షులు గుడివాడ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌ : పిడిఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభకు పోర్టు అఖిలపక్ష కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక మద్దతు తెలిపింది. జగదాంబ దరి సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐక్యవేదిక నాయకులు విఎస్‌.పద్మనాభరాజు (గౌరవ అధ్యక్షులు, యునైటెడ్‌ పోర్ట్‌ అండ్‌ డాక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ - సిఐటియు), బిసిహెచ్‌.మసేన్‌ (విశాఖ హార్బర్‌ అండ్‌ పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ - ఎఐటియుసి), ఎన్‌.కనకారావు (జాతీయ అధ్యక్షులు, జనతా పోర్ట్‌ అండ్‌ డాక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ - సిఎఫ్‌టియుఐ), జి.చందు (అధ్యక్షులు, నేషనల్‌ పోర్ట్‌ ట్రస్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ - ఐఎన్‌టియుసి), బి.రామారావు (ప్రధాన కార్యదర్శి, విడిబిఎల్‌ అండ్‌ సిహెచ్‌డి పెన్షనర్స్‌ సంక్షేమ సంఘం), బి.లక్ష్మణరావు (ప్రధాన కార్యదర్శి, విడిఎల్‌బి అండ్‌ డాక్‌ వర్కర్స్‌ యూనియన్‌ - సిఐటియు) మాట్లాడారు. పోస్టర్‌ను ఆవిష్కరించారు. నాయకులు బి.జగన్‌, సత్యన్నా రాయణ, రామలింగేశ్వరావు, ఎల్లారావు, నర్సింగరావు పాల్గొన్నారు.
ఎంవిపి.కాలనీ:కోరెడ్ల రమాప్రభను గెలిపించాలంటూ 18వ వార్డు అంజయ్య నగర్‌ కాలనీలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పిడిఎఫ్‌ బృందం సభ్యులు జె.కోదండ, ఎం.చంటి, జి.సంతోష్‌, ఎన్‌వి.రమణ, జె.లక్ష్మి, జి.గీతాంజలి, కనక మహాలక్ష్మి, చందు, ప్రణరు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌.రాము ఆధ్వర్యాన గురువారం ప్రచారం చేశారు. అచ్చుతాపురం మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో ఉదయం వాకర్స్‌ను కలిశారు.
రోలుగుంట: మండలంలోని కొండపాలెం, కొమరవోలు, అడ్డసరం గ్రామాల్లో పిడిఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సిపిఎం నాయకులు ఈరెల్లి చిరంజీవి, శ్రీరామ్మూర్తిలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.