ప్రజాశక్తి - యంత్రాంగం
ఉక్కునగరం : డాక్టర్ కోరెడ్ల రమాప్రభ విజయాన్ని కాంక్షిస్తూ స్టీల్‌ప్లాంట్‌లోని స్టోర్ జంక్షన్ వద్ద పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ,మన వాణిని అసెంబ్లీలో వినిపించేందుకు డాక్టర్ కోరెడ్ల రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. స్టీల్ కార్మిక సంఘాల ప్రతినిధులు జె.రామకృష్ణ, రామ్‌కుమార్, డివి.రమణారెడ్డి, బి.కామేశ్వరరావు, కర్ర ప్రకాష్, ఎన్.కృష్ణారావు, డేవిడ్, స్టీల్ సిఐటియు ప్రతినిధులు బి.అప్పారావు, పి.శ్రీనివాసరాజు, పి.నీలకంఠరావు, వివిధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
మధురవాడ : వివిధ ప్రజా సంఘాల నాయకులు సాగర్‌నగర్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ, విజ్ఞులైన పట్టభద్రులు డాక్టర్ కోరెడ్ల ర్రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం గుడ్లవాని పాలెం, సాగర్ నగర్, సుభాష్ నగర్, ముసలయ్యపాలెం తదితర ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు. సిఐటియు జోన్ కార్యదర్శి పి.రాజ్‌కుమార్, డివైఎఫ్‌ఐ నాయకులు వై.రాము, కెవిపిఎస్ నాయకులు విజరు, జెవివి నాయకులు మురళిధర్ తదితరులు పాల్గొన్నారు.
ఎంవిపి.కాలనీ : డాక్టర్ కోరెడ్ల రమాప్రభకు ఎఐవైఎఫ్ నేతలు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు మద్దిలపాలెంలో సమావేశం నిర్వహించారు. సంఘం విశాఖ జిల్లా కన్వీనర్ ఎన్.మధు రెడ్డి, జివిఎంసి 15, 16 వార్డుల అధ్యక్షులు దారపు లక్ష్మణ్ రెడ్డి, రావి అశోక్, కెల్ల రమణ, రౌతునాయుడు పాల్గొన్నారు.
పెందుర్తి : జివిఎంసి 94, 95, 97 వార్డులో పరిధిలో డాక్టర్ రమాప్రభ గెలుపును కోరుతూ ప్రజాసంఘాల ఆధ్వర్యాన ప్రచారం నిర్వహించారు. 94వ వార్డు పరిధి రవినగర్, భాష్యం పాఠశాల ఐద్వా నాయకులు రమణి, సిఐటియు నాయకులు శంకరరావు, కృష్ణరాయపురంలో సిఐటియు నాయకులు బిటి.మూర్తి, 97వ వార్డు పరిధి చినముసిడివాడలో సిఐటియు నాయకులు మౌలాలి, లక్ష్మణరావు, జగన్నాథస్వామి, 95వ వార్డు పరిధి గొల్లవిల్లివానిపాలెం, పాపరాజుపాలెం ప్రాంతాల్లో సిఐటియు నాయకులు సూర్య ప్రకాష్, జయబాబు కోరుతూ కరపత్రాలను పంపిణీ చేశారు.
అనంతగిరి : రమాప్రభను గిరిజన సంఘం ఆధ్వర్యాన జెడ్‌పిటిసి దీసరి. గంగరాజు, గిరిజన సంఘం మండల నాయకులు కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లి పట్టభద్రుల ఓటర్లను కలిశారు. గగిరిజన సంఘం నాయకులు ఎస్. నాగులు, టోకూరు సర్పంచ్ కిల్లో మొస్య, నాయకులు జి. దేవన్న, సురేష్ పాల్గొన్నారు
డుంబ్రిగుడ: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా పిడిఎఫ్ అభ్యర్థి డాక్టర్ కోరెడ్ల రమాప్రభ విజయాన్ని కాంక్షిస్తూ సిెఐటియు, గిరిజన సంఘం, సంఘాల ఆధ్వర్యంలో మండలంలోని కోర్ర, కితలంగి, కిల్లోగూడ, నందివలస, గుంటసీమ గ్రామాల్లో కరపత్రాలను పంచుతూ ప్రచారం చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌బి పోతురాజు, గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.సూర్యనారాయణ పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
డిఎల్ పురంలో ప్రచారం
నక్కపల్లి:ఉత్తరాంధ్ర పట్టభద్రుల పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు కోరారు. మండలంలోని డిఎల్ పురంలో సోమవారం ఎన్నికల ప్రచారం చేశారు. పట్టభద్రులను కలిసి రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గింజాల వెంకటరమణ, జనవిజ్ఞాన వేదిక సభ్యులు రాము తదితరులు పాల్గొన్నారు.
కోరెడ్ల రమాప్రభకు ప్రజా సంఘాల మద్దతు
అనకాపల్లి : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పిడిఎఫ్ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభకు ప్రజా సంఘాల సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రజా సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో సోమవారం వారు ప్రసంగించారు. నిరుద్యోగ యువత, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సమస్యలు పిడిఎఫ్ అభ్యర్థి గెలుపుతోనే పరిష్కరించబడతాయని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ కోన లక్ష్మణ, అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పిఎస్ అజరు కుమార్, సామాజిక హక్కుల వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు రాజాన దొరబాబు, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నరాలశెట్టి సత్యనారాయణ, ఎల్‌ఐసి ఏజెంట్ కుమార్, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు విత్తనాల పోతురాజు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణీంద్ర కుమార్, ఏఐటీయూసీ నాయకులు ఈశ్వరరావు, ఒమ్మి శ్రీను, సిఐటియు నాయకులు చలపతి పాల్గొన్నారు.










