Oct 11,2023 21:39

కరపత్రాలను విడుదల చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారస్సులను అమలు చేయాలని ఏపీ రైతుసంఘం జిల్లా ఆధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈనెల 13న పెనుకొండలో నిర్వహించే పేదల భూమికోసం రాష్ట్ర సదస్సుకు సంబంధించి కరపత్రాలను నాయకులు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ భూములు, పేదల భూములను అదానీ, అంబానీలకు కట్టపెడుతోందన్నారు. పేదలకు అనుకూలమైన చట్టాలను పెట్టుబడిదారులు కార్పొరేట్లకు అనుకూలంగా మార్చుతుందన్నారు. అన్యాక్రాంతమైన భూములను తిరిగి పేదలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్‌హెచ్‌. బాషా, సిఐటియు మండల అధ్యక్షులు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.