
ప్రజాశక్తి - కాళ్ల
మండలంలోని కోమటిగుంటలో కనకదుర్గదేవి ఆలయ మూడో వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. రామాలయం కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి హోమాలు నిర్వహించారు. ఉండి ఎంఎల్‌ఎ మంతెన రామరాజు విచ్చేసి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న సమారాధన నిర్వహించారు. రామాలయం ఆలయ కమిటీ ఉండి ఎంఎల్‌ఎ మంతెన రామరాజును సత్కరించి జ్ఞాపికను అందించారు. ఈ అన్నసమారాధనకు వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు విచ్చేశారు. మాజీ సర్పంచులు యలమంచిలి వెంకటరమణ, యలమంచిలి రామాంజనేయులు, టిడిపి గ్రామ అధ్యక్షులు జిఎన్‌వి.సత్యనారాయణ, టిడిపి తెలుగు యువత అధ్యక్షులు మంతెన నాగాంజ నేయులు, టిడిపి నాయకులు కాపు శెట్టి సత్యనారాయణ, వెంకటరమణ, వైవిఎస్ గణపతి, సీసలి మాజీ సర్పంచి శ్రీనివాసరావు, వాస్కూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.