
శంకుస్థాపన చేస్తున్న నేతలు
ప్రజాశక్తి-మాడుగుల:ఉద్యానవన శాఖ సబ్సిడీ నిధులతో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు సహకారంతో మండల కేంద్రంలో కోల్డ్ స్టోరేజ్ భవనాలు, కలెక్షన్ సెంటర్లకు శంకుస్థాపన నిర్వహించారు.వైఎస్‌ఆర్ క్రాంతి పథకం (వెలుగు ప్రాజెక్ట్) కు సంబంధించి శ్రీ మోదమాంబ గొర్రెలు, మేకలు రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో సుమారు కోటి రూపాయల నిర్మాణ వ్యయంతో నిర్మించనున్నారు. ఈ నిర్మాణాలు పూర్తయితే ఏజెన్సీ వ్యాప్తంగా 11 మండలాల గిరిజనులు తమ వ్యవసాయ ఉత్పత్తులను అవసరం మేరకు నిలువ చేసుకునే సామర్థ్యం, ఉపయోగకరంగా ఉంటుందని ఎంపీపీ పెదబాబు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు ఇటువంటి సౌకర్యం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కుక్కర్ శ్రీధర్, హేమంత్, ఎఫ్‌పిఓ సిసి దంగేటి ప్రసాద్ పాల్గొన్నారు.