
ప్రజాశక్తి - పుట్టపర్తి అర్బన్ : వినాయక నిమజ్జనానికి పట్టణంలోని ఏర్పాటు చేసిన గణనాథులను ప్రజలు కోలాహలంగా తీసుకెళ్లారు. పుట్టపర్తి, గోకులం, ఎనుములపల్లి లో వెలసిన గణనాథులను పట్టణంలో ట్రాక్టర్ల ద్వారా ఊరేగించారు. నిమజ్జనానికి కొన్ని విగ్రహాలను సాహెబ్ చెరువు కు, మరికొన్ని ఎనుములపల్లి చెరువుకు తరలించారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా సిఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు.
వేలంలో దక్కించుకున్న లడ్డు : గణనాధుల కోసం ఏర్పాటు చేసిన లడ్డును పలువురు వేలంపాట ద్వారా దక్కించుకున్నారు. పట్టణంలోని వివేకనంద రోడ్డులో వెలసిన గణనాధుని కోసం చేసిన లడ్డును బెస్త సాయినాథ్ 70 వేల రూపాయలకు దక్కించుకున్నారు. అలాగే గోపురం నాలుగవ క్రాస్ లో ప్రవీణ్ సాయి 52 వేలకు దక్కించుకున్నాడు.
గాండ్లపెంట : మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను బుధవారం ఘనంగా నిమజ్జనం చేశారు. ఈసందర్భంగా ఇన్‌చార్జి ఎస్‌ఐ మక్బూల్‌బాషా ఆధ్వర్యంలో పోలీసులు గట్టిభద్రతా చర్యలు చేపట్టారు. మండల వ్యాప్తంగా దాదాపు 50 విగ్రహాలను ప్రతిష్టించారని ఎస్‌ఐ చెప్పారు. వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ జీ రవీంద్రారెడ్డి, గ్రామసర్పంచులు బి శాంతమ్మ, కళావతి రవీంద్ర నాయక్, ఏపీఎస్‌ఆర్టీసీడ్రైవర్ రమణ, చలపతి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
కొత్తచెరువు : వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విగ్రహాలను పుట్టపర్తి రోడ్డు మీదుగా బుక్కపట్నం చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వాణి శ్రీనివాసులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
బత్తలపల్లి : బత్తలపల్లిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను బుధవారం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇన్‌ఛార్జి ఎస్‌ఐ ప్రదీప్ కుమార్, ఎఎస్‌ఐ సోమశేఖర్ తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
ఓబుల దేవర చెరువు : మండల కేంద్రంలోని శివాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ మండపానికి ముస్లిం సోదరుడు షేక్ నిజాంవలి లడ్డూను కానుకగా అందించారు. గత 14 ఏళ్ల నుంచి వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహానికి లడ్డుని కానుక ఇస్తున్నారు. బుధవారం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని మండల కేంద్రానికి చెందిన హోటల్ కిష్ట, టైలర్ రాము , హెడ్ కానిస్టేబుల్ ఎస్ ఎస్ గౌడ్, లక్ష్మి పతి ఆధ్వర్యంలో నిర్వహించారు.
రొద్దం : మండల వ్యాప్తంగా వివిధ గ్రామాలలో బుధవారం వినాయక నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని ఆర్ మరువపల్లి గ్రామంలో బీసీ కాలనీ, మహాత్మా జ్యోతిరావు బాపులే పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేశారు.
తలుపుల : మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను బుధవారం నిమజ్జనం చేశారు. ఈసందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
గోరంట్ల: మండలంలోని పాలసముద్రం సమీపాన విఆర్‌ఎం గ్రూప్ అధినేత వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రేట్ విల్లాస్ లో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహ నిమజ్జనాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది వినాయక చవితి పండగ పురస్కరించుకొని వి ఆర్ ఎం గ్రూప్ అధినేత వెంకటేశ్వరరావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈసందర్భంగా గణేష్ విగ్రహం వద్ద నిలువ ఉంచిన లడ్డూను వేలం వేశారు. రూ.1.19 లక్షలకు రిటైర్డ్ ఉపాధ్యాయుడు కృష్ణారెడ్డి వేలంలో లడ్డూను దక్కించుకున్నాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నరసింహులు గ్రామస్తులు పాల్గొన్నారు
మడకశిర : మండల పరిధిలోని భీమరాయనపల్లిలో బుధవారం వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఓబుల దేవర చెరువు : మండలంలోని పలు గ్రామాల్లో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. గౌనిపల్లి , తంగేడుకుంట, మద్దకువారిపల్లి, చౌడేపల్లి, నందివారిపల్లి, తదితర గ్రామాల్లో గణేష్ విగ్రహాలను ట్రాక్టర్లో ఉంచి ఊరేగించారు. నిమజ్జనం సందర్భంగా గౌనిపల్లిలో లడ్డు వేల వేలం వేయగా మల్లెల రమేష్ రూ 20, 116లకు, పాడారు శేషయ్య గారి పల్లి తండాలో వేలం పాట నిర్వహించగా రూ. 14 వేలకు శ్రీరామ నాయక్ దక్కించుకున్నారు.