Aug 24,2022 23:09

నామినేషన్లు దాఖలు చేస్తున్న కర్రి అప్పలస్వామి ప్యానల్‌ సభ్యులు

అడవివరం సహకార పరపతి సంఘం ఎన్నికలు
కోలాహలంగా నామినేషన్లు
ప్రజాశక్తి-సింహాచలం     
అడవివరం సహకార పరపతి సంఘం ఎన్నికల నామినేషన్‌ పర్వం బుధవారం కోలాహలంగా ప్రారంభమైంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో మొత్తం 13 మంది సభ్యులున్న ఈ సొసైటీ పాలకమండలి ఎన్నికల కోసం 28 మంది నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా మాజీ అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి ప్యానల్‌ సభ్యులు సింహాచలం తొలిపావంచా వద్ద సింహాద్రి అప్పన్న చెంత నామినేషన్‌ పత్రాలు ఉంచి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రదర్శనగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. వీరితోపాటు కొందరు స్వతంత్రులు కూడా నామినేషన్లు పత్రాలను ఎన్నికల అధికారి ఎం.శ్యామలకు అందజేశారు.
అడవవరం సొసైటీ పాలకమండలిలో అడవివరం నుంచి 9 మంది సభ్యులు, నగర పరిధి నుంచి ఇద్దరు సభ్యులు, గాజువాక,పెందుర్తి ప్రాంతాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 13మంది సభ్యులను సొసైటీ సభ్యులు ఓటింగ్‌ ద్వారా ఎన్నుకోనున్నారు.