Aug 19,2022 23:15

కరాస రామకష్ణా స్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలు

జిల్లాలోని పలుపాఠశాలలు, కృష్ణమందిరాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను కోలాహలంగా నిర్మించారు. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో చిన్నారులు అలరించారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.పలుచోట్ల అన్నసమారాధనలు నిర్వహించారు.
గాజువాక : గాజువాకలో పలుచోట్ల కష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. గాజువాక హైస్కూల్‌ రోడ్‌లోని విజ్ఞాన్‌ హైస్కూల్‌లో కష్ణాష్టమి వేడుకల్లో భాగంగా చిన్నారుల శ్రీకష్ణ వేషధారణ, ఉట్టి కొట్టడం, కోలాటాలు వంటి వేడుకలను నిర్వహించారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
భీమునిపట్నం : జివిఎంసి, ఒకటో జోన్‌ పరిధిలో పలుచోట్ల శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక సన్‌ స్కూల్‌ ప్రాంగణంలో విద్యార్థులు ప్రదర్శించిన శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాఠశాల కరస్పాండెంట్‌ కె శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
టి.నగరపాలెంలో అన్నసమారాధన
భీమిలి మండలం టి నగరపాలెంలో శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా అన్నదానం నిర్వహించారు. సర్పంచ్‌ పొట్నూరు ఛాయాగౌతమి, ఎంపిటిసి పల్లా నీలిమ తదితరులు పాల్గొన్నారు.
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో
మండలంలోని చిప్పాడ దివీస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సిఎస్‌ఆర్‌ ప్రతినిధి నాగరాజు పాల్గొన్నారు.
ఆనందపురం: మండలంలోని బొడ్డపాలెంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని శ్రీకృష్ణుడి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు పాల్గొన్నారు. అనంతరం అన్నసమారాధనలో రాజబాబు పాల్గొని, అన్న ప్రసాదాలను వడ్డించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు ముత్యాలరెడ్డి, చెన్నై అప్పలరాజు, ఎలక్ట్రిషన్‌ అప్పలరాజు, రాజు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
కరాస :ఎన్‌ఎడి దరి రామకృష్ణ పాఠశాలలో జన్మాష్టమి వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుని చిత్రపటానికి పాఠశాల డైరెక్టర్‌ ఎ.కృష్ణారెడ్డి, ప్రిన్సిపల్‌ జి.రవీంద్రుడు పూలమాలలు వేసి పూజలు చేశారు. విభిన్న చిన్నికృష్ణుల వేషధారణతో చిన్నారులు అలరించారు. విద్యార్థులు నృత్యప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ ఎం.శ్రీనివాసరావు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
సింహాచలం: మురళీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో సింహాచల ప్రాంతంలో శ్రీకృష్ణాష్టమి ఉత్సవాన్ని సంఘ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం శ్రీకృష్ణ విగ్రహాల ప్రతిష్టాపన ప్రత్యేక పూజలను నిర్వహించారు సాయంత్రం చిన్నారుల శ్రీకృష్ణ వేషధారణలు, ఉట్టి ఉత్సవాన్ని నిర్వహించారు. శ్రీకృష్ణుని తిరువీధి ఉత్సవంలో అధికసంఖ్యలో యాదవులు పాల్గొన్నారు.
ఆరిలోవ : పెదగదిలి శ్రీబాల మురళీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్ఠమి వేడుకల్లో నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, శ్రీనివాసరావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోకోద్ధరణకు, ధర్మసంరక్షణకు శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో ఎత్తిన అవతారమే శ్రీకృష్ణుడు అన్నారు.
ముడసర్లోవ పార్కులో..
ముడసర్లోవ పార్కులో శ్రీకృష్ణ విగ్రహాన్నిఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు, విఎంఆర్‌డిఎ చైర్మన్‌, వైసిపి తూర్పు సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల వేర్వేరుగా వచ్చి దర్శించుకున్నారు. శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు బుడుమూరు గోవిందు, ఒమ్మి అప్పలరాజు, ముగడ రాజారావు, బాదరు బాలరాజు పాల్గొన్నారు.
భారతి ఇంగ్లీష్‌మీడియం స్కూల్‌లో...
శ్రీకృష్ణాష్ఠమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆరిలోవ, భారతీ ఇంగ్లీషు మీడియం స్కూల్‌ ఆవరణలో రాథాకృష్ణుల ప్రతిమలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులు రాథాకృష్ణుల వేషధారణలు, ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. 'ముద్దులాడే యశోద' గేయానికి చిన్నారుల నృత్యప్రదర్శన అందరినీ కట్టిపడేసింది. ఉట్టి కొట్టే ఉత్సవం ఆద్యంతం సందడిగా సాగింది. పాఠశాల అధినేత ఎంవి.రావు, ఉపాధ్యాయ బృందం పాల్గొని, పర్యవేక్షించారు.
ములగాడ : మల్కాపురం గొల్లవీధిలో శ్రీ విజ్ఞాన మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్‌, సిఐ దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.
మాధవధార : మాధవ యువజన సమాజం ఆధ్వర్యంలో మాధవధార కోదండ రామాలయంలో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. మాధవ యువజన సమాజం కన్వీనర్‌ సనపల రారగోపాలరావు, సహాయ కన్వీనర్‌ పప్పల రామచందరరావు, మహిళా సంఘం నాయకురాలు పప్పల శ్రీదేవి, నిర్వాహకులు నంబాల ఉందంతరావు, సనపల శంకరరావు పాల్గొన్నారు. గాయత్రి విద్యామందిర్‌ కరస్పాండెంట్‌ సనపల జగదీశ్వరరావు, గొండు భాస్కరరావు ప్రసాదాన్ని ఉచితంగా అందజేశారు.