వినుకొండ: జనసేన కార్యకర్తపై దాడి చేసిన అధికార పార్టీ నాయకుడు కోలా వీరాంజనేయులుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన నాయకులు శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కన్నా రజిని మాట్లాడుతూ వినుకొండ మండలం కొప్పుకొండ గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు కోల వీరాంజనేయులు,అదే గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్త గుద్దేటి బ్రహ్మం, ఆమె తల్లి శేషమ్మలను చంపేస్తానని బెదిరించి ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేసి దాడి చేశారని అన్నారు. గ్రామంలో వీరాంజనేయులు అక్రమంగా మట్టిని తరలిస్తుండగా జనసేన కార్యకర్త గుద్దేటి బ్రహ్మం వారి వద్దకు వెళ్లి ఫోటోలు తీశారనే కారణంతో వీరాంజనేయులు బెదిరింపులతో దాడికి పాల్పడ్డారని అన్నారు. బ్రహ్మం పై ఆగస్టు 8 సాయంత్రం దాడి జరగగా 9వ తేదీన వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పది రోజులు గడుస్తున్న వినుకొండ పోలీ సులు కేసు నమోదు చేయలేదని అన్నారు. వీరాంజనేయు లుకు అధికార పార్టీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అండ ఉండటం వల్లే పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరో పించారు. బ్రహ్మం కుటుంబం పై ఎటువంటి అఘా యిత్యా లు జరిగిన పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. వీరాంజనేయులపై హత్యాయత్నం కేసు నమోదు చేసే వరకూ కదిలేది లేదని రజిని స్పష్టం చేశారు. జనసేన జిల్లా నాయకులు నిశంకర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వినుకొండ పోలీసులు పక్షపాత ధోరణి తో వ్యవహరిస్తు న్నారని ఆరోపించారు.










