Nov 04,2023 16:28

ప్రజాశక్తి - భీమడోలు
   టిడిపి ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు శనివారం మండలంలోని కోడూరుపాడులో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా గ్రామంలోని ఇంటింటికి వెళ్లారు. రానున్న ఎన్నికల్లో టిడిపి విజయం సాధించగానే అమలు చేయనున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.