ఏడుగురు అరెస్టు
వేర్వేరు ప్రాంతాల్లో కోడిపందేల స్థావరంపై దాడి చేసిన పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొత్తం ఏడు కోడి పుంజులను, నగదు స్వాధీనం చేసుకున్నారు.
ప్రజాశక్తి - ఆగిరిపల్లి
కోడిపందేల స్థావరంపై దాడి చేసిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి కోడిపుంజులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆగిరిపల్లి ఎస్‌ఐ ఎన్.చంటిబాబు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని సింహాద్రి అప్పారావుపేటలో కోడిపందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్‌ఐ ఎన్.చంటిబాబు తన సిబ్బందితో ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు కోడి పుంజులను, రూ.2,400 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
యర్రంపల్లిలో ఇద్దరు అరెస్టు
చింతలపూడి : కోడిపందేల స్థావరంపై దాడి చేసిన పోలీసులు ఇద్దరికి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కోడిపుంజులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. చింతలపూడి ఎస్‌ఐ హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని యర్రంపల్లి గ్రామంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్‌ఐ హరికృష్ణ తన సిబ్బందితో ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి మూడు కోడిపుంజులు, రూ.1530 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.










