Jan 16,2023 23:36

ప్రజాశక్తి-మాకవరపాలెం: మండలంలో రామన్నపాలెం గ్రామంలో బహిరంగ ప్రదేశాల్లో కోడిపందాలు జరుగుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం అందుకున్న ఎస్‌ఐ. రామకృష్ణ తన సిబ్బందితో సోమవారం దాడి చేశారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. వారి నుండి రూ.1450 నగదు, మూడు కోడి పుంజులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
గొలుగొండ:మండలంలోని గుండుపాల కొత్తూరు గ్రామలో కోడి పందాల శిబిరంపై ఎస్సై నారాయణరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నిర్వహిస్తున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
ఎస్‌.రాయవరం:మండలంలో కోడిపందాలు జరుగుతున్న ప్రాంతాలలో దాడులు జరిపి ఆరుగురుని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపారు. సోమవారం ఉదయం వమ్మవరం గ్రామంలో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేయగా నలుగురు వ్యక్తులు, ఏడు కోళ్ళు, ఆరువందల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. దార్లపూడి గ్రామంలో కోడిపందాలపై దాడి చేయగా ఇద్దరు వ్యక్తులు, ఏడు కోడిపుంజులు, పది హేడు వందల పట్టుబడిందన్నారు. ఎస్‌.రాయవరం గ్రామ శివారులో మామిడితోటలో ఐదుగురిని పట్టుకుని, వారి వద్ద నుండి 12 కోడిపుంజులు, 3500 స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.