కొనుగోలు కేంద్రంలో ధాన్యానికి గిట్టుబాటు ధర
ప్రజాశక్తి-బిట్రగుంట : ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా అమ్ముకోవడం వల్ల ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర్నా అందిస్తుందని బోగోలు మండల వ్యవసాయ అధికారిణి ఎస్.విజయలక్ష్మి పేర్కొన్నారు. తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం ఈక్రాఫ్ట్ పంట నమోదు కార్యక్రమంపై గ్రామ రెవెన్యూ అధికారులకు, గ్రామ వ్యవసాయ సహాయకులకు అవగాహన కార్యక్రమాన్ని డిప్యూటీ తహశీల్దార్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో రైతులు పండించే పంటను ఈ క్రాఫ్ట్ విధానంలో అవకతవకలు లేకుండా పంట నమోదు కార్యక్రమం జాగ్రత్త తీసుకోవాలని, గ్రామ రెవెన్యూ అధికారులతో గ్రామ వ్యవసాయ సహాయకులు కలిసి సమన్వయంతో పోవాలని, ఈ పంటలో నమోదు చేసుకున్న రైతుకు ఇన్సూరెన్స్, పంట సబ్సిడీలు వంటివి ప్రభుత్వం నుంచి అందుతాయన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ స్టాటికల్ అధికారి ప్రసాద్, గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, తదితరులు పాల్గొన్నారు.










