ప్రజాశక్తి-అజిత్‌సింగ్‌నగర్
పెంచిన వంట గ్యాస్ ధరలు ఉపసంహరించాలని సిపిఎం ఆధ్వర్యంలో 62, 63 డివిజన్‌లోని రెడ్డిగారి కూరగాయలకొట్టు సెంటర్లో నిరసన ఆదివారం నిర్వహించారు. అనంతరం 63వ డివిజన్లో గ్యాస్, కరెంటు, చెత్త పన్ను, ఆస్తి పన్ను రద్దు చేయాలని పాదయాత్ర నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు పాల్గొని మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రోలు, డీజిల్ నిత్యవసర సరుకులు పెంచుకుంటూపోతూ ప్రజలపై అనేక భారాలు వేస్తోందన్నారు. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ వైసిపి ప్రభుత్వం. బిజెపి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ప్రజల కష్టాలు పట్టించుకో పోగా అనేక రూపాలలో చెత్త పన్ను, ఇంటి పన్నులు, కరెంటు చార్జీలు పెంచి ప్రజలను ఇబ్బందిపెడుతుందన్నారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి భూపతి రమణ రావు, కార్యదర్శివర్గ సభ్యులు కె. దుర్గారావు, నగర నాయకులు చింతల శ్రీనివాస్, నాయకులు యం. రామాంజనేయులు, పి సాంబి రెడ్డి, కూరపాటి నాగరాజు, జెల్లా నాగరాజు, రఫీ, యు. శివ లింగేశ్వరరావు, లింగాల నిర్మల తదితరులు పాల్గొన్నారు.










