Oct 21,2023 20:28

మూతబడిన బంగారు అంగళ్లు

 ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు బంగారు దుకాణాలపై ఆదాయ పన్ను శాఖ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. గురువారం సాయంత్రం నుంచి ఈ దాడులు జరుగుతున్న విషయం తెలి సిందే. విషయం జిల్లా వ్యాప్తంగానే కాక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఎవరినికీ లోనికి అనుమతించకుండా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సరైన పత్రాలు బిల్లులు లేని పన్ను చెల్లించని కిలోల కొద్ది బంగారం నగలు పెద్దమొత్తంలో అధికారులు గుర్తించారు. బంగారు వ్యాపారంలో రెండవ ముంబాయిగా పేరుగాంచిన ప్రొద్దుటూరులో నిత్యం జీరో వ్యాపారం రూ.కోట్లల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. స్థానిక అధికారులు అడపా దడపా దాడులు చేసినప్పటికీ సత్పలితాలివ్వలేదు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోట్ల రూపాయల ఎగ్గొట్టడంతో అధికారులు దాడులకు శ్రీకారం చుట్టారు. బంగారు వ్యాపారంలో అగ్రగామిగా పేరుగాంచిన బుశెట్టి రామ్మోహన్‌ను కేంద్రంగా చేసుకొని వారి బంధువుల అంగళ్లలో ఇతరత్రా ప్రముఖంగా వ్యాపారం చేసే వారిపై తనిఖీల పరంపర కొనసాగుతోంది. స్థానిక బంగారు వ్యాపారస్తులపై సుమారు నాలుగు నెలలుగా అధికారులు దృష్టి పెట్టినట్లు సమాచారం. బంగారు కొనగోలుదారులుగా వచ్చి బంగారు కొన్నట్లుగా తెలిసింది. వీరు కొన్నబంగారుకు బిల్లులు ఇవ్వలేదని సమాచారం. దసరా పండుగవేళ అయితే అమ్మకాలు కొనుగోలు భారీగా జరు గుతాయని అంచనా వేసి దాడులు చేపట్టారు. దాడులు ఆది వారం కూడాజరుతుతాయని సమాచారం. సుమారు 40 మంది అధికారులు కేంద్ర బలగాల రక్షణతో సోదాలు చేప ట్టారు. ప్రొద్దుటూరులో ఎక్కడా చూసినా ఈ దాడుల గురించే ప్రధాన చర్చనీయాంశమైంది. దాడుల నేపధ్యంలో బంగారు అంగళ్లు దాదాపుగా మూసివేశారు. వ్యాపారుల వద్ద లెక్కలు చూపని కిలోల కొద్ది బంగారు దొరికిందని వ్యాపారుల స్థిర చరాస్థులను కూడా అధికారుల సీజ్‌ చేశారని చర్చోపచర్చలు సాగుతున్నాయి. అదికారులు మాత్రం ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.