Oct 06,2023 23:44

ప్రజాశక్తి-యంత్రాంగం
మాజీ సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టిడిపి శ్రేణష్ట్రలు చేస్తున్నరిలేనిరాహార దీక్షలు శుక్రవారం కొనసాగాయి.
అమలాపురం చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ పై అమలాపురం పట్టణంలో షాదీఖాన వద్ద జరిగిన మేము సైతం బాబు కోసం 'రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా 24వ రోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇంఛార్జ్‌, మాజీ ఎంఎల్‌ఎ అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో అమలాపురం రూరల్‌ మండలం అధ్యక్షులు మల్లుల పోలయ్య అధ్యక్షతన ముఖ్యఅతిధిగా రాష్ట్ర కార్యనిర్వా హక కార్యదర్శి మెట్ల రమణబాబు,పెచెట్టి చంద్రమౌళి పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడ సోంబాబు, టౌన్‌ అధ్యక్షులు తిక్కరెడ్డి నేతాజీ, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు పెచెట్టి విజయలక్ష్మి, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు మట్టా మహాలక్ష్మి ప్రభాకర్‌,జిల్లా ఉపా అధ్యక్షులు బడుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మండపేట చంద్రబాబుకు మద్దతుగా స్ధానిక మున్సిపల్‌ కార్యాల యం వద్ద ఎంఎల్‌ఎ వేగుళ్ళ జోగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరహారదీక్ష శిబిరంలో శుక్రవారం టిడిపి నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. రాయవరం మండలంలోని చెల్లూరు గ్రామానికి చెందిన టిడిపి నాయకులు దేవు వెంకటరాజు సగం గుండు గీయించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ వేగుళ్ల మాట్లాడుతూ చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌ కు పంపారన్నారు. ఈ దీక్షకు పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్‌ కార్యదర్శి సల్మాన్‌ హుస్సేన్‌, టిడిపి నాయకులు తదితరులు సంఘీభావం తెలిపారు.
టిడిపి నాయకుల గృహనిర్బంధం
మామిడికుదురు చంద్రబాబుకు ఈనెల 19 వరకు రిమాండ్‌ పొడిగించబడడానికి నిరసిస్తూ రాజమహేంద్రవరం తరలి వెళుతున్న టిడిపి నాయకులు జాలం సుబ్బారావును శుక్రవారం నగరం పోలీసులు హౌస్‌ అరెస్టులు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి అనుమతులు లేవన్నారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరునికి ఉందని పోలీసుల అంక్షలతో నిర్బంధించడం సరికాదన్నారు.