Oct 01,2023 21:33

ఫొటో : దీక్ష చేపడుతున్న టిడిపి నాయకులు

కొనసాగుతున్న టిడిపి రిలే దీక్షలు
ప్రజాశక్తి-కావలి : చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా స్థానిక టిడిపి పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం నియోజకవర్గ స్థాయిలోని టిడిపి పార్టీ కుటుంబ సభ్యులతో 18వ రోజు రిలే నిరాహార దీక్షలు ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బానాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును 23 రోజులుగా జైలులో ఉంచారని, తాము 18 రోజులుగా శాంతియుతంగా ఈ రిలే నిరాహార దీక్షలను చేపడుతున్నామని తెలిపారు. కక్ష సాధింపుతోనే ఈ ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ప్రతిఒక్కరూ చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని ఖండిస్తున్నారని తెలిపారు.
జగన్మోహన్‌ రెడ్డి కావాలని చంద్రబాబుపై పగబట్టి జైలుకు పంపారనే భావన ప్రజల్లో ఉందన్నారు. ముఖ్యమంత్రి చేతగాని పరిపాలనను, సైకో మనస్తత్వాన్ని గమనిస్తున్న ప్రజలు, రాబోయే ఎన్నికల్లో బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. అదేవిధంగా నిన్నటి రోజున శనివారం టిడిపి కుటుంబ సభ్యుల్లో చిన్నపాటి కలహం ఏర్పడిందని, కుటుంబం అన్న తర్వాత కలహాలు సహజమని, పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, తమ కుటుంబ సభ్యులందరూ సమిష్టిగా ఉన్నారని తెలిపారు. కావలి పట్టణ ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు అధికంగా మొగ్గు చూపుతున్నారని, కచ్చితంగా కావలిలో టిడిపి జెండా రెపరెపలాడుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు షేక్‌.మస్తాన్‌, తటవర్తి వాసు, ఆత్మకూరి నాగరాజు, మంచాల ప్రసాద్‌, గొట్టిపాటి రాము, నేలపాటి మాల్యాద్రి, పి.రమేష్‌, ఎన్‌.శ్రీనివాసులు, నూతలపాటి శాంతి కుమార్‌, గుత్తికొండ కిషోర్‌ బాబు, అద్దంకి వెంకటేశ్వర్లు ఆచారి, రఫీ, పల్లపుకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.