ప్రజాశక్తి - యంత్రాంగం
టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్‌ను నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. కాకినాడ సిటీలో మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. వినాయక చవితి సందర్భంగా గణనాధుని విగ్రహం ప్రతిష్టాంచి పూజలు నిర్వహించారు. జగన్ విఘ్నం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని పూజలు నిర్వహించారు. జనసేన నాయకులు ముత్తా శశిధర్, తోట సుధీర్, వాసిరెడ్డి శివ, విజరు గోపాల్, రాలీ రాంబాబు తదితరులు దీక్షలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడారు. చంద్రబాబకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే అక్రమ అరెస్టులు చేశారన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు గతంలో స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగేవన్నారు. అవినీతిపరుడైన జగన్ వచ్చిన తర్వాత తగాదాలు, ఘర్షణలు, బెదిరింపులు, కక్ష సాధింపు చర్యలు వంటి వాటికి బీజం వేశారన్నారు. వైసిపిని సాగనంపేదుకు ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు. జనసేన నాయకులు ముత్తా శశిధర్, తోట సుధీర్ మాట్లాడుతూ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశసం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో దండుప్రోలు నాగబాబు, చక్కా శ్రీనివాస్, సుంకవిళ్లి దొరబాబు, తదితరులు పాల్గొన్నారు.
మాజీ మేయర్ ఆధ్వర్యంలో...
కాకినాడ మాజీ మేయర్, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షులు సుంకర పావని ఆధ్వర్యంలో మహిళలతో కలిసి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. జనసేన కాకినాడ ఇన్‌ఛార్జి ముత్తా శశిధర్, సిపిఐ కార్యదర్శి తాటిపాక మధు, కార్యదర్శి తోకల ప్రసాద్ తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబును రాజకీయ కక్షతో అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. తమ నాయకుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు.
అన్నవరంలో టిడిపి ప్రతిపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరుపుల సత్యప్రభ సత్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం అన్నవరానికి పాదయాత్రగా చేరుకున్నారు ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ చంద్రబాబు కడిగిన ముత్యంలా విడుదల కావాలని, రాష్ట్రంలో సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని పూజలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ ఎంఎల్‌ఎలు జ్యోతుల నెహ్రూ, చిక్కాల రామచంద్రరావు, వనమాడి కొండబాబు, నాయకులు యనమల కృష్ణుడు, జడ్‌పి మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్, టిడిపి నాయకులు నరసయ్య, బి.సురేష్, కె.లోవదొర తదితరులు పాల్గొన్నారు
సామర్లకోట రూరల్ చంద్రబాబుకు బెయిల్ రావాల, ఆయన ఆరోగ్యం బాగుండాలని కాంక్షిస్తూ మంగళవారం అచ్చంపేటలోని ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప క్యాంపు కార్యాయలయం నుంచి ఆయన తనయుడు నిమ్మకాయల రంగనాగ్ ఆధ్వర్యంలో అన్నవరం సత్యదేవుని దేవస్థానానికి తరలి వెళ్లారు. మెహర్ కాంప్లెక్స్ వినాయకుని ఆలయం వద్ద 108 కొబ్బరికాయలను టిడిపి అధ్యక్షుడు అడబాల కుమారస్వామి, కార్యదర్శి బడుగు శ్రీకాంత్‌ల ఆధ్వర్యంలో కొట్టారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలేశ్వరంలో చంద్రబాబు విడుదల కోరుతూ టిడిపి ప్రతిపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెదేపా నియోజకవర్గ పరిశీలకులు మెట్ల వెంకటరమణ, ముదునూరి మురళీకష్ణంరాజు, నాయకులు కార్యకర్తలు ఉన్నారు
కాకినాడ రూరల్ మండలంలోని సర్పవరంంలో కనకదుర్గమ్మ అమ్మవారికి 108 మంది ముత్తైదువులు బోనాలు సమర్పించారు. మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మీసత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో వలసపాకల పార్టీ కార్యాలయం నుంచి సర్పవరం జంక్షన్ వరకు ర్యాలీగా తరలివచ్చి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంఎల్‌ఎ అనంతలక్ష్మి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణమూర్తి మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందన్నారు. ఇందులో భాగంగానే టిడిపి అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కటకం శెట్టి ప్రభాకర్, కాళ్ళ సత్తిబాబు, కరప మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, మాజీ జెడ్పిటిసి సభ్యులు బుంగా సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.










