Oct 16,2023 22:06

సీతంపేట : చంద్రబాబుకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి-సీతంపేట : చంద్రబాబుకు అరెస్టుకు నిరసనగా టిడిపి నాయకులు నిరసనలు కొనసాగుతున్నాయి. మండలంలోని పెద్దూరులో బాబుతో నేను సైతం కార్యక్రమంలో బాగంగా ఇంటి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడును అన్యాయంగా అరెస్టు చేశారని వివరించారు. పాలకొండ నియోజకవర్గ ఇంచార్జ్‌ నిమ్మక జయకృష్ణ, రాష్ట్ర ఎస్టీ సెల్‌ కార్యదర్శి బిడ్డిక చంద్రరావు, మండల పార్టీ అధ్యక్షులు సవర తోట మొఖలింగం, ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు గంట సుధ, ఐటిడిపి హిమరక పవన్‌, సర్పంచ్‌ బిడ్డిక నీలయ్య, మండంగి కుమార్‌, మోహన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : జియ్యమ్మవలస మండలం చింతలబెలగాం పంచాయతీ సింగనాపురంలో టిడిపి నాయకులు నిరసన తెలిపారు. ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ గురించి వివరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు పల్ల రాంబాబు, టిడిపి అరుకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, ఎంపిపి బొంగు సురేష్‌ ,ఎస్టీ సెల్‌ నాయకులు నందివాడ కృష్ణబాబు, కొప్పలవెలమ సాధికార సమితి అధ్యక్షులు మూడడ్ల సత్యం నాయుడు, ఎంపిటిసి జి సత్యం నాయుడు, నీటి సంఘం అధ్యక్షులు ఎల్‌. స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి : మండలంలోని గిజబ గ్రామంలో బాబుతో నేను కార్యక్రమం నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి ఆధ్వర్యాన జరిగింది. చంద్రబాబు అక్రమ అరెస్టు ఖండించి ప్రజలకు వివరించారు. జగన్‌ను ఇంటికి పంపే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అక్కేన మధుసూదన్‌ రావు, నాయకులు ఎం. పురుషోత్తమ నాయుడు, అంబటి రాంబాబు, స్థానిక ఎంపిటిసి సింహాచలం, మాజీ సర్పంచ్‌ ఎం.కృష్ణంనాయుడు, మండల రాంబాబు , ఎం.కురిమినాయుడు తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురంరూరల్‌ : మండలంలో చినబొండపల్లిలో టిడిపి ఆధ్వర్యంలో బాబుతోనే నేను కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజయచంద్ర ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, పోల సత్యనారాయణ , బోను చంద్రమౌళి చంటి, గొంగాడ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.