ప్రజాశక్తి - కురుపాం : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా జిల్లాలో వివిధ రూపాల్లో నిరసన వ్యక్తమవుతున్నాయి. పలువురు నిరసనదీక్షలు చేపట్టగా, మరికొన్ని చోట్ల కరపత్రాలు పంపిణీ, ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం వద్ద టిడిపి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కొండయ్య, ఎఎంసి మాజీ చైర్మన్ కోలా రంజిత్ కుమార్, ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి కృష్ణబాబు, మాజీ సర్పంచ్ రామరాజు, టిడిపి నాయకులు కన్నా, బి.రామకృష్ణ, కర్రి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్ : మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో మండలంలోని ఎమ్మార్‌నగరంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ముందుగా గ్రామంలోని పలు ఆలయాల్లో సామూహిక ప్రార్ధనలు జరిపారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు జి.వెంకట నాయుడు, అధ్యక్ష కార్యదర్శులు దొగ్గ మోహన్‌రావు, బోను చంద్రమౌళి, చంటి, చిన్నరామినాయుడు, బసవ మన్మధరావు, రెడ్డి చంటి, బుడితి శ్రీరాం, పలు పంచాయతీలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి : చంద్రబాబునాయుడు నిర్దోషిగా బయటకు రావాలని కోరుతూ మండలంలోని తోటపల్లిలో గల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిగాయి. టిడిపి మండల అధ్యక్షులు ఎ.మధుసూదనరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పురుషోత్తమ నాయుడు, అంబటి తవిటి నాయుడు (రాంబాబు) ఎంబి విజయ అంకుశం, కోటా సుమన్ భరత్ తదితరులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడిలో ఈశ్వుడికి అభిషేకం చేశారు. అనంతరం గ్రామంలో ప్లే కార్డులు పట్టి నిరసన తెలిపారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు పల్ల రాంబాబు, టిడిపి అరుకు పార్లమెంట్ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, ఎంపిపి బొంగు సురేష్, ఎస్టీ సెల్ అరుకు పార్లమెంటు అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు, కురుపాం నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు గురానా శ్రీరామ్మూర్తినాయుడు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాలకొండ : చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మండలంలోని చింతాడ, అట్టలిలో కరపత్రాలను టిడిపి నాయకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు గండి రామినాయుడు, మాజీ సర్పంచ్ కాశీ నాయుడు, నాయకులు జాడ శ్రీధర్, మీసాల శ్రీనివాసరావు, బెజిపురం శశికళ, మజ్జి రాజు, గోపాలనాయుడు, మజ్జి సుభద్రమ్మ, పాల్గొన్నారు.
సీతంపేట : చంద్రబాబు నాయుడును అక్రమ అరెస్టు చేశారని టిడిపి మండల అధ్యక్షులు సవర తోట మొకలింగం, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బి.చందర్రావు కార్యకర్తలు పలి పుట్టి సమీపంలో ఉన్న పోలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
సాలూరు: చంద్రబాబు నాయుడును విడుదల చేయాలని కోరుతూ స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్ ఆధ్వర్యాన పట్టణ, మండల నాయకులు ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










