ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి పట్టణంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన ఆధ్వర్యాన చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం కొనసాగాయి. ఈ దీక్షల్లో మండలంలోని కారాడ, రెడ్డియ్యవలస, గొంగాడవలస గ్రామాల కార్యకర్తలు కూర్చున్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు అల్లాడ భాస్కరరావు, రాంబార్కి శరత్, వి.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల : చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామినాయుడు డిమాండ్ చేశారు. సోమవారం టిడిపి నియోజకర్గ ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు, నియోజక వర్గం సీనియర్ నాయకులు కంది చంద్ర శేఖర్ రావు ఆధ్వర్యంలో డెంకాడ టిడిపి నాయకులు నియోజక వర్గ కేంద్రంలో జరుగుతున్న సత్యేమేవ దీక్షల్లో పాల్గొని సంఘీ భావం తెలిపారు. జరజాపుపేటలో గుర్తించిన సిరిమాను చెట్టుకి టిడిపి నేతలు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మహంతి చిన్నం నాయుడు, సీనియర్ నాయకులు సువ్వాడ రవి శేఖర్, నెల్లిమర్ల, డెంకాడ, భోగాపురం మండల అధ్యక్షులు కడగల ఆనంద్ కుమార్, పల్లె భాస్కరరావు, కర్రోతు సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు, పతి వాడ అప్పల నారాయణ, పోతల రాజప్పన్న, లెంక అప్పల నాయుడు, మహిళా నాయకులు చీకటి సుహాసిని, చిల్ల పద్మ, పాణి రాజు, పతివాడ విద్యా సాగర నాయుడు తదితరులు పాల్గొన్నారు.
వేపాడ : చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బానాది ఎంపిటిసి గొంప తులసి, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
శృంగవరపుకోట : పట్టణంలోని ఆకుల డిపో వద్ద గొంప రమాదేవి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. మాజీ ఎంపిపి రెడ్డి వెంకన్న హలాసనం వేసి నిరసన తెలిపారు.










