ప్రజాశక్తి-పాచిపెంట : టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా జిల్లాలో ఆ పార్టీ శ్రేణుల నిరసన కార్యకమాలు శనివారం కొనసాగాయి. శనివారం మండలంలోని పి.కోనవలసలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా మోకాళ్లపై అర్ధ నగంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని టిడిపి నాయకులపై అక్రమ కేసులు బనాయించి, అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజానీకమంతా గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసిపికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు పిన్నింటి ప్రసాదబాబు కొట్యాడ సత్యనారాయణ, నిమ్మాది చిట్టి, గూడెపు యుగంధర్, కె.పోలినాయుడు, చల్లా కనకారావు, తదితరులు పాల్గొన్నారు.
సీతంపేట : చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా టిడిపి మండల అధ్యక్షులు సవరతోట మొఖలింగం ఆధ్వర్యాన సీతంపేటలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం కొనసాగాయి. కార్యక్రమంలో టిడిపి ఎస్‌టి సెల్ రాష్ట్ర కార్యదర్శి బిడ్డిక చంద్రరావు, టిడిపి నాయకులు ఎల్.కృష్ణ, సవర సోడంగా, బి.స్వామినాయుడు, పులిపుట్టి వైస్ సర్పంచ్ ఊయక సుదర్శన్‌రావు, బిడ్డిక ప్రసాద్, రమేష్ పాల్గొన్నారు.
కురుపాం : రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించి ఆనందిస్తున్న వైసిపి చీకటి పాలనకు చరమగీతం పాడాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి టి.జగదీశ్వరి పిలుపునిచ్చారు. శనివారం కురుపాంలోని టిడిపి కార్యాలయంలో రిలే నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ కలిశెట్టి కొండయ్య, అక్కేన మధు, ఎఎంసి మాజీ చైర్మన్ కోలా రంజిత్ కుమార్, అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి డి.రామకృష్ణ, ఎస్‌టి సెల్ పార్లమెంట్ ప్రధానకార్యదర్శి నందివాడ కృష్ణబాబు పాల్గొన్నారు.
సీతంపేట : బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా సీతంపేట మండలంలోని పొల్ల గ్రామంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయక్రిష్ణ ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను అందజేశారు.
సీతానగరం : మండలంలోని మరిపివలస గ్రామంలో శనివారం బాబుకి మద్దతుగా టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బి.విజరుచంద్ర ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేశారు. అనంతరం పశువుకులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టిడిపి బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బి.చిరంజీవులు, ఉదయభాను, మండల అధ్యక్ష, కార్యదర్శులు కొల్లు తిరుపతిరావు, ఆర్.వేణుగోపాల్ నాయుడు, ఎస్.హరి గోపాలరావు పాల్గొన్నారు.










