Sep 27,2023 21:45

సాలూరులో అర్ధనగ ప్రదర్శన చేపడుతున్న టిడిపి శ్రేణులు

ప్రజాశక్తి - కురుపాం: టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా టిడిపి శ్రేణులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం కొనసాగాయి. స్థానిక టిడిపి కార్యాలయంలో వినూత్నరీతిలో నోటికి నల్లగుడ్డ కట్టి మౌనదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి టి.జగదీశ్వరి, యువ నాయకులు విరేష్‌ చంద్రదేవ్‌, తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా రంజిత్‌ కుమార్‌, కురుపాం మండల కన్వీనర్‌ కలిశెట్టి కొండయ్య, కన్నా, కృష్ణబాబు, వెంకటరావు, రమేష్‌ , మీసాల ప్రశాంత్‌, సాయి, తాడంగి రామారావు, తదితరులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం వైసిపి దుర్మార్గపు పాలనకు నిదర్శనమని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి దుయ్యబట్టారు. గుమ్మలక్ష్మీపురం గిరిజన వారపు సంతలో బాబుతో నేను కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్న చంద్రబాబును అక్రమంగా, అన్యాయంగా అరెస్టు చేయడం విచారకరమని ఆమె అన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి బాబుతో నేను కార్యక్రమంపై ప్రచారం నిర్వహించారు. ఎల్విన్‌పేటలో సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ పాడి సుదర్శన్‌రావు, కార్యదర్శి పోలూరి శ్రీనివాసరావు, నాయకులు కడ్రక వెంకట్రావు, ఎప్పరిక బుజ్జేశ్వరరావు, సొంటేనా రాజేష్‌, తాడంగి రామారావు, కయ్యన్న తదితరులున్నారు.
సాలూరు : మాజీ సిఎం చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బుధవారం టిడిపి నాయకులు, కార్యకర్తలు అర్ధనగ ప్రదర్శన నిర్వహించారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్‌ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, మండల అధ్యక్షులు ఆముదాల పరమేష్‌ పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్‌ : టిడిపి అధినేత చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం టిడిపి ఎస్‌సి సెల్‌ ఆధ్వర్యాన తహశీల్దార్‌ కార్యాలయంలో వినతి అందించారు.
బలిజిపేట : మండలంలో నారాయణపురంలో టిడిపి మండల అధ్యక్షులు పెంకి వేణుగోపాల్‌ నాయుడు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బి.విజయచంద్ర మాట్లాడారు. ఆందోళనకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పాలూరి బాబు మద్దతిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి పెంకి పార్వతి, టిడిపి సీనియర్‌ నాయకులు పెంకి రామ్మోహనరావు, గొట్టాపు వెంకట్‌ నాయుడు, మండల ప్రకాశ్‌, ఎం.అప్పారావు, జి.సింహాచలం, వి.సింహా చలం, కె.సింహాచలం, వి.తిరుపతిరావు, ఎం.సూర్య నారాయణ, ఎస్‌.రాంబాబు, జి.బాబ్జి పాల్గొన్నారు.
వీరఘట్టం : చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ బుధవారం మండల కేంద్రంలోని బాబుకు తోడు మేము సైతం కరపత్రాలను టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు ఉదయాన ఉదరు భాస్కర్‌, రాష్ట్ర కార్యదర్శి కె.అప్పలనాయుడు, ఎఎంసి మాజీ చైర్మన్‌ పి.కృష్ణమూర్తి నాయుడు, పి.వెంకటరమణ, బి.హరిబాబు, ఎ.కుమారస్వామి, కె.అసిరినాయుడు, సిహెచ్‌ ఉమామహేశ్వరరావు, ఎన్‌.శశికుమార్‌, కె.ఉమాశంకర్‌, జనసేన నాయకులు ఎ.పుండరీకం, జి.నరేంద్ర పాల్గొన్నారు.
గరుగుబిల్లి : గరుగుబిల్లి మండల కేంద్రంలో బాబుతో మేము సంతకాల సేకరణ కార్యక్రమాన్ని టిడిపి మండల కన్వీనర్‌ అక్కేన మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో చేపట్టారు. కార్యక్రమంలో టిడిపి బిసి సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం.పురుషోత్తమ నాయుడు, కార్యదర్శి ఎం.తవిటినాయుడు, టిడిపి అరకు పార్లమెంట్‌ కార్యదర్శి ఎం.బి.విజయ అంకుశం, నాయకులు అంబటి రాంబాబు, కోట సుమన్‌ భారత్‌, యడ్ల శ్రీనివాసరావు, ఎంపిటిసి వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సీతంపేట : మండలంలో శిలగం పంచాయతీలో టిడిపి మహాశక్తి కార్యక్రమంపై, అధినేత చంద్రబాబు అరెస్టుపై ఆ పార్టీ ఎస్‌టి సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బి.చంద్రరావు, మహాశక్తి ప్రచారకర్త టి.సంధ్యారాణి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
నేడు టిడిపి పాదయాత్ర
కురుపాం : కురుపాంలోని టిడిపి కార్యాలయం నుంచి తోటపల్లి దేవస్థానం వరకు గురువారం చేపడుతున్న పాదయాత్ర, సైకిల్‌ ర్యాలీని విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు వైరచర్ల వీరేశ్‌ చంద్రదేవ్‌ తెలిపారు. బుధవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టు చేశారని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా గురువారం పాదయాత్ర, సైకిల్‌ర్యాలీ చేపడుతున్నట్లు వివరించారు.