Sep 26,2023 22:08

కురుపాం : దీక్షల్లో పాల్గొన్న శత్రుచర్ల విజయరారాజు, వైరిచర్ల వీరేష్‌చంద్రదేవ్‌

ప్రజాశక్తి - కురుపాం : నిలువ నీడలేని ఆంధ్రప్రదేశ్‌ కోసం నిరంతరం శ్రమించి, రాష్ట్రానికి దశ, దిశ చూపి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపడం, రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించడమే చంద్రబాబు చేసిన తప్పా అని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రమైన కురుపాం టిడిపి కార్యాలయంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రభుత్వం కుట్రలతో అక్రమ కేసులో ఇరికించారని మండిపడ్డారు. టిడిపి యువ నాయకులు వైరచర్ల వీరేష్‌ చంద్రదేవ్‌ మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్‌ అక్రమమని అందరికీ తెలుసునని, అందుకే ఆయన కోసం దేశ, విదేశాల్లో ప్రజలంతా నిరసన తెలుపుతున్నారని అన్నారు. అది చూసైనే వైసీపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని, చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా రంజిత్‌ కుమార్‌, టిడిపి కన్వీనర్లు కలిశెట్టి కొండయ్య, శేఖరపాత్రుడు, అక్కేన మధు, టిడిపి నాయకులు కన్నా, కె. రామరాజు, ఎన్‌.కృష్ణబాబు, రావివలస ఎంపీటీసీ సుమన్‌, సంతోషపురం సర్పంచ్‌ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
మొండెంఖల్‌ లో బాబుతో నేను కార్యక్రమం
కురుపాం : మండలంలో మొండెంఖల్‌ లో మంగళవారం బూత్‌ నెంబర్‌ 23, 24 క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌ రంజిత్‌కుమార్‌ నాయక్‌ ఆధ్వర్యంలో జరిగిన బాబుతో నేను కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి టి.జగదీశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులపై వివరించి రానున్న ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసి గెలిపించాలని, అప్పుడే ఈ అరాచక ప్రభుత్వం అంతమై సుభిక్షమైన సుపారి పాలన వస్తుందని అన్నారు. కార్యక్రమంలో బూత్‌ ఇన్‌ఛార్జిలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సాలూరు: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు కి నిరసనగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. పట్టణంలోని వెంకటేశ్వరా డీలక్స్‌ సెంటర్‌లో నియోజకవర్గ ఇన్చార్జి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌ దేవ్‌ ఆధ్వర్యాన దీక్షలు కొనసాగించారు. అంతకుముందు మహిళలు పూర్ణ కలశాలతో ర్యాలీగా వెళ్లి కోట దుర్గ ఆలయం పూజలు చేశారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, మండల పార్టీ అధ్యక్షులు ఆముదాల పరమేష్‌, పాచిపెంట సీనియర్‌ నాయకులు ఎం.సూర్యనారాయణ , మహిళా కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్‌ : కుట్రలు, కుతంత్రాలు వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి నైజం అని, తమ అధినాయకులు చంద్రబాబు, నారా లోకేష్‌ పై ఎన్ని కేసులు పెట్టినా ప్రజల మద్దతుతో ధైర్యంగా ఎదుర్కొంటామని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనెల విజరు చంద్ర అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్‌ కు నిరసనగా గత కొద్ది రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు నిరసన కార్యక్రమాల్లో భాగంగా కొత్తవలసలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవి, సీనియర్‌ నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల మద్దతు ఉన్న నాయకుడ్ని కుట్రలు కుతంత్రాలు ఏమీ చేయలేవని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గొట్టాపు వెంకట్‌ నాయుడు, కౌన్సిలర్లు కే నారాయణ రావు, బడే గౌరీ నాయుడు, తాతపూడి వెంకట రావు, కోల సరితా మధు, నాయకులు బార్నాల సీతారాం బోను చంద్రమౌళి, పాలకొండ రాజశేఖర్‌ పోల సత్యనారాయణ, అమరాపు రామకృష్ణ, గురజాన చంద్రమౌళి కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి : చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మండలంలో నాగూరులో గ్రామ దేవత శ్రీ రాగాలమ్మ తల్లికి గుడిలో అరకు పార్లమెంట్‌ జిల్లా తెలుగు మహిళా విభాగం అధికార ప్రతినిధి అక్కేన జగదీశ్వర్‌ ఆధ్వర్యంలో మంగళవారం మహిళలు ప్రత్యేక పూజలు చేసి చంద్రబాబుపే వెంటనే విడుదల చేయాలని, సైకో జగన్మోహన్‌ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మండల టిడిపి మండల అధ్యక్షులు అక్కేన మధుసూదన్‌ రావు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
వీరఘట్టం : చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మండల కేంద్రంలోని చంద్రబాబుకు తోడు మేము సైతం కార్యక్రమాన్ని చేపట్టారు. సైకో పోవాలి సైకిల్‌ రావాలి, అరాచక పాలన ముఖ్యమంత్రి మాకొద్దు నినాదాలు చేశారు. కార్యక్రమంలో మండల, పట్టణ అధ్యక్షులు ఉదయాన ఉదరు భాస్కర్‌, జామి లక్ష్మీనారాయణ, పారిచర్ల వెంకటరమణ, బళ్ల హరిబాబు, మాచర్ల అనిల్‌కుమార్‌, బి.నీలకంఠంనాయుడు, ఎ.కుమారస్వామి, ఎన్‌.శశి కుమార్‌, సిహెచ్‌ ఉమామహేశ్వరరావు, కె.అప్పన్న, జామి సింహాచలం, యామక అప్పలనాయుడు, తాతబాబు, కృష్ణ, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.
భామిని : స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద చంద్రబాబునాయుడు అరెస్టు అక్రమంటూ కళ్లకు గంతులు కట్టుకొని నిరసన చేపట్టారు. పాలకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎన్‌.జయకృష్ణ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో టిడిపి నాయకులు భోగాపురపు రవి నాయుడు, మేడిబోయిన జగదీశ్వరరావు, భూపతి ఆనందరావు, అగతముడి గోవిందరావు, పాశర్ల నాగేశ్వర రావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.