
ప్రజాశక్తి - భామిని : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మండలంలోని తలడాలో పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యాన బాబుతో నేను కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటింటికి వెళ్లి చంద్రబాబు అక్రమ అరెస్ట్, అక్రమ రిమాండ్‌లు తదితరు అంశాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఎస్‌సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొట్టిముక్కల కోటేశ్వరరావు, మండలం ప్రధాన కార్యదర్శి మెడిబోయిన జగదీశ్వరావు, మండల టిడిపి అధ్యక్షులు భోగాపురపు రవి నాయుడు, మాజీ ఎంపిపి భూపతి ఆనందరావు, అంపిలి కేశవ,పాశర్ల నాగేశ్వరరావు, అగుతముడి గోవిందరావు, పోలాకి రాంబాబు, భామిని సర్పంచ్ లోపింటి రాజేష్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : చంద్రబాబునాయుడు అరెస్టు తీవ్ర అన్యాయమని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకు ప్రజలు అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు పల్ల రాంబాబు, అరుకు పార్లమెంట్ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, ఎంపిపి బొంగు సురేష్, ఎస్టీ సెల్ అరుకు పార్లమెంటు అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు, అరుకు పార్లమెంట్ కొప్పలవెలమ సాధికార సమితి అధ్యక్షులు మూడడ్ల సత్యం నాయుడు, కురుపాం నియోజకవర్గ తెలుగు అధ్యక్షులు గురాన శ్రీరామ్మూర్తి నాయుడు, నియోజకవర్గ కాపు సంఘం అధ్యక్షులు లంక గోపాలం, నియోజకవర్గ వెలమ సంఘం అధ్యక్షులు రెడ్డి బలరాం స్వామినాయుడు, జనసేన మండల అధ్యక్షులు వారణాశి శివకుమార్, జిల్లా కార్య నిర్వహణ కార్యదర్శి పెంట శంకరరావు, నియోజకవర్గ ఐటి వింగ్ కో-ఆర్డినేటర్ ఎల్ రంజిత్ కుమార్, టిడిపి, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సీతంపేట: చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ మల్లెమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని రాష్ట్ర ఎస్‌టి సెల్ కార్యదర్శి బిడ్డిక చంద్రరావు కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అక్రమ అరెస్టు చేయడంతో నిరసన తెలిపారు.
చంద్రబాబు అరెస్టు బాధాకరం
గుమ్మలక్ష్మీపురం: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు బాధాకరమని, జైలు లో పెట్టి 40రోజులైనా విడుదల చేయకుండా వైసిపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందని కురుపాం నియోజకవర్గం టిడిపి సీనియర్ నాయకులు బిడ్డిక పద్మావతి అన్నారు. స్కిల్ డెవలప్మెంట్‌లో ఎటువంటి తప్పు చేయకపోయినా 73ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిని ఇలా బాధ పెట్టడం దారుణమన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి పాలన నడుస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ఏం జరిగినా ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. టిడిపి పక్షాన , చంద్రబాబుకు అండగా ప్రజలు ఉన్నారని తెలిపారు. వైసిపి పాలన పూర్తిగా విఫలమైందన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో, కురుపాంలో టిడిపి విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.