ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : సిఎం జగన్మోహన్‌రెడ్డి ఎన్ని కుతంత్రాలు, కుట్రలు పన్నినా ప్రజల తీర్పు మాత్రం చంద్రబాబు వైపేనని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనెల విజరు చంద్ర అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షల నిరసన కార్యక్రమాల్లో భాగంగా శనివారం స్థానిక పాత బస్టాండు నుండి జిల్లా కేంద్ర ఆసుపత్రి కూడలిలోనున్న అంబేద్కర్ విగ్రహం వరకు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి, నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎలాంటి అవినీతికి పాల్పడలేదనడానికి ఆయన అరెస్టు అనంతరం, కేవలం రాష్ట్రం, దేశం నుండే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజల నుండి లభిస్తున్న మద్దతే పెద్ద ఉదాహరణ అని అన్నారు. ప్రశ్నిస్తున్న నాయకులందర్నీ తప్పుడు కేసులతో జైలులో పెట్టాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి తీరును ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ఓట్ల రూపంలో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కె.నారాయణ రావు, బడే గౌరినాయుడు, తాతపూడి వెంకటరావు, కోల సరితా మధు, నాయకులు బార్నాల సీతారాం, జిల్లా ఉపాధ్యక్షులు గొట్టాపు వెంకటనాయుడు, బోను చంద్రమౌళి, పాలకొండ రాజశేఖర్, పోల సత్యనారాయణ, అమరాపు రామకృష్ణ గురజాన చంద్రమౌళి, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కురుపాం : స్థానిక టిడిపి కార్యాలయం వద్ద బిసి సెల్ ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహార దీక్షలో నియోజకవర్గ ఇన్చార్జి టి.జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం సాగిస్తున్న నిరంకుశ పాలనకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి మరడాన తవిటి నాయుడు, పార్లమెంట్, నియోజకవర్గ బిసి సెల్ నాయకులు విజయంకుసం, గంగాధర్ నాయుడు, కెవి కొండయ్య, అక్కేన మధు, అంబటి రాంబాబు, షన్ముక చంద్ర పండా, పోలూరు శ్రీనివాసరావు, బలగ రామకృష్ణ, కర్రి శ్రీను, కన్నా, కె.రామరాజు తదితరులు పాల్గొన్నారు. వీరఘట్టం : చంద్రబాబునాయుడుకు తోడుగా మేము సైతం కార్యక్రమంలో భాగంగా వీరఘట్టంలో పాలకొండ నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కర్నేని అప్పలనాయుడు, మండల అధ్యక్షులు ఉదయాన ఉదయభాస్కర్, పట్టణ అధ్యక్షులు జామి లక్ష్మీనారాయణ, ఎఎంసి చైర్మన్ కృష్ణమూర్తి నాయుడు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పారిచర్ల వెంకటరమణ, మండల యువత అధ్యక్షులు మాచర్ల అనిల్ కుమార్, బల్ల హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.భామిని: బాబుతో మేము కార్యక్రమంలో భాగంగా భామినిలో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. ఈ దీక్షల్లో టిడిపి మండల అధ్యక్షులు భోగాపురపు రవినాయుడు మాట్లాడుతూ, చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలనీ, వాస్తవాలు వక్రీకరించి అక్రమ అరెస్ట్ ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం ప్రధాన కార్యదర్శి మెడిబోయిన జగదీశ్వరరావు, కోరాడ రాజేష్, భూపతి ఆనందరావు, కొల్ల మధు, కొల్ల నవీన్, పొత్తక మహేష్, గెల్లంకి మాధవరావు, పొత్తక చిరంజీవులు, ఈగల సోమేశ్వరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీతంపేట : మండలంలోని కుసిమిలో బాబుతో నేను కార్యక్రమాన్ని టిడిపి నియోజకవర్గ నాయకులు భూదేవి చేపట్టారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బి జయలక్ష్మి, కె విశ్వనాథం మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.










