Sep 19,2023 22:14

కోట నుంచి పైడితల్లి అమ్మవారి ఆలయానికి ర్యాలీగా వెళ్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-విజయనగరం కోట :  చంద్రబాబు ఎటువంటి నేర ఆరోపణ లేకుండా బయటకు రావాలని కోరూతూ విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద టిడిపి నాయకులు మంగళవారం పూజలు చేశారు. తొలుత కోట వద్ద ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన టిడిపి నాయకులు అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల నియోజకవర్గాల అధ్యక్షులు కిమిడి నాగార్జున, గుమ్మడి సంధ్యారాణి, నాయకులు కోళ్ల లలిత కుమారి, డాక్టర్‌ కొండపల్లి అప్పలనాయుడు, కర్రోతు బంగారురాజు. బోనెల విజయచంద్ర, తోయక జగదీశ్వరి మాట్లాడారు. టిడిపిని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే ఈ రకమైన అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి జైల్లో పెట్టించారని అన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అవసరం ఎంతయినా ఉందన్నారు. నేడు చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారంటే అది ఆయన పరిపాలన విధానం దూరదృష్టే అందుకు నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, నాయకులు ఆర్‌పి భంజ్‌దేవ్‌, ద్వారపురెడ్డి జగదీష్‌, మహంతి చిన్నం నాయుడు, కరణం శివరామకృష్ణ, అల్లాడ భాస్కరరావు, చింతల రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి గొంపకృష్ణ, విజయనగరం పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దుల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలి నాయుడు, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, ఉమ్మడి జిల్లాల నాయకులు అందరూ పాల్గొన్నారు.
గ్రామ, వార్డు స్థాయిలో నిరసనలు
చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా విజయనగరం నియోజకవర్గం లోని అన్ని గ్రామాలు, వార్డుల్లోను ఒక్కరోజు నిరాహారదీక్షలు టిడిపి నాయకులు, కార్యకర్తలు చేపట్టారు. పొలిట్‌బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌ గజపతిరాజు సారిక, చెల్లూరు, రీమాపేట గ్రామాల్లోను, నగరంలోని 6, 7, 28, 29, 35 వార్డుల్లో తెలిపిన వారికి వెళ్లి సంఘీభావం తెలిపారు. విజయనగరం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున 29వ వార్డుకు వెళ్లి సంఘీభావం తెలిపారు. జనసేన నాయకులు గురాన అయ్యలు గారు 15, 47వ వార్డులలో సంఘీభావం తెలిపారు. ద్వారపూడిలో నిరసనలు చేస్తున్న వారికి బొద్దల నర్సింగరావు సంఘిభావం తెలిపారు చంద్రబాబు నాయుడు వెంటనే విడుదల చేయాలని కోరుతూ విటి అగ్రహారంలో మాజీ కౌన్సిలర్‌ రొంగలి రామారావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.